అంతుచిక్కని వ్యాధితో గుజరాత్‌లో 13 మంది మృతి
ABN, Publish Date - Sep 09 , 2024 | 04:19 AM
అంతుచిక్కని వ్యాధి గుజరాత్‌ను కలవరపెడుతోంది. ఆ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఇప్పటివరకు 13 మంది ఈ వ్యాధితో మృత్యువాత పడ్డారు.
గాంధీనగర్, సెప్టెంబరు 8: అంతుచిక్కని వ్యాధి గుజరాత్‌ను కలవరపెడుతోంది. ఆ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఇప్పటివరకు 13 మంది ఈ వ్యాధితో మృత్యువాత పడ్డారు. కచ్ జిల్లాలో కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలు కురిశాయి. అనంతరం ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు, న్యూమోనియా తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరడం ప్రారంభించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్న క్రమంలో ఊపిరితిత్తులు, కాలేయం చెడిపోవడంతో 13 మంది మృత్యువాతపడ్డారు. చికిత్సకు లొంగని జ్యరంతో ఆస్పత్రుల్లో చేరిన రెండు రోజులకే వీరిలో చాలామంది మృతి చెందడం తీవ్ర కలవరానికి గురి చేస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. మృతుల రక్త నమూనాలను సేకరించి గాంధీనగర్‌లోని ల్యాబ్‌కు పంపించామని ఆ రిపోర్టులు వస్తే గానీ వ్యాధి ఏదని నిర్ధారించలేమని వైద్యులు చెబుతున్నారు.
Updated Date - Sep 09 , 2024 | 04:19 AM