Mukesh Ambani: కుమారుడి వివాహ వేడుకల్లో ముకేశ్ అంబానీ భావోద్వేగం..
ABN, Publish Date - Jul 12 , 2024 | 06:24 PM
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ(Mukesh Ambani) వివాహ వేడుక ముంబయిలో ఘనంగా జరుగుతోంది. వివాహానికే అంబానీ రూ. 5 వేల కోట్లు ఖర్చుపెడుతున్నారు.
ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ(Mukesh Ambani) వివాహ వేడుక ముంబయిలో ఘనంగా జరుగుతోంది. వివాహానికే అంబానీ రూ. 5 వేల కోట్లు ఖర్చుపెడుతున్నారు. వివాహ బంధంతో ఒకటి కాబోతున్న అనంత్ - రాధిక జంటను చూసేందుకు అతిరథమహారథులు ఇప్పటికే ముంబయికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత్, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరిస్తున్నాయి. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జంటను చూసి తండ్రి ముకేశ్ అంబానీ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తొలుత రాధిక మర్చంట్ కుటుంబం గృహ శాంతి పూజ జరిపి, పూర్వీకులను గుర్తు చేసుకుని, నవగ్రహారాధన చేసింది. అనంతరం వధూవరులిద్దరూ దండలు మార్చుకున్నారు. అనంతరం పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ముకేశ్ అంబానీ సహా, రాధిక మర్చంట్ తల్లిదండ్రులు కూడా ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.
For Latest News and National News
Updated Date - Jul 12 , 2024 | 07:26 PM