Anant and Radhika's wedding: ఇద్దరు ఏపీ వ్యక్తులపై కేసు నమోదు
ABN, Publish Date - Jul 14 , 2024 | 08:51 PM
రిలయన్స్ గ్రూప్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ముంబైలో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది.
ముంబయి, జులై 14: రిలయన్స్ గ్రూప్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ముంబైలో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఆహ్వానం లేకుండా ప్రవేశించేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీసులు వెల్లడించారు. వీరిద్దరిపై వేర్వేరుగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
Also Read: Aam Aadmi Party: కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు
Also Read: Harash Nagotra: యువకుడు ఆత్మహత్య.. మోదీకి మృతుడి ఫ్యామిలీ లేఖ
అల్లూరి వెంకటేష్ నరసయ్య (26) యూట్యూబర్ అని చెప్పాడని.. ఇక మహమ్మద్ షఫీ షేక్ (28) తనను తాను వ్యాపారవేత్తగా పేర్కొన్నారని పోలీసులు వివరించారు. వీరిద్దరు ఈ వివాహ వేడుకల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో.. సందేహం కలిగి అడ్డుకున్నామన్నారు. ఆ క్రమంలో వారిని ప్రశ్నించగా.. ఈ వివాహా వేడుకకు తమకు ఆహ్వానం లేదని చెప్పారని తెలిపారు.
Also Read: Kargil War: అమరవీరులకు రక్షణ మంత్రిత్వ శాఖ ఘన నివాళి
Also Read: BJP Chief: బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగింపు..!
దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం వీరిద్దరిని విడిచి పెట్టామన్నారు. వీరిద్దరికి నోటీసులు ఇస్తామని.. అలాగే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. అయితే వీరిద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినట్లు తమ విచారణలో స్పష్టం చేశారని పోలీసులు పేర్కొన్నారు.
Also Read: AP DGP: ఎవరైనా దాడులకు పాల్పడితే.. సహించేది లేదు
Also Read: LokSabha: కాంగ్రెస్ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్
Also Read: Puri Ratna Bhandar: పూరీలో తెరుచుకున్న రత్నభాండాగారం.. లోపలకి వెళ్లిన బృందం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 14 , 2024 | 08:56 PM