ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Priyanka Gandhi : అన్నా.. గర్విస్తున్నా!

ABN, Publish Date - Jun 06 , 2024 | 05:56 AM

సత్యసాధన కోసం జరిగే పోరాటంలో రాహుల్‌ ఆగలేదని, వెనక్కి తగ్గలేదని ఆయన సోదరి, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచి ప్రదర్శన ఇచ్చిన

రాహుల్‌ను ఉద్దేశించి ప్రియాంక పోస్ట్‌

న్యూఢిల్లీ, జూన్‌ 5: సత్యసాధన కోసం జరిగే పోరాటంలో రాహుల్‌ ఆగలేదని, వెనక్కి తగ్గలేదని ఆయన సోదరి, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచి ప్రదర్శన ఇచ్చిన మరునాడు రాహుల్‌ను ఉద్దేశించి ఆమె ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. సాహసోపేత రాజకీయ నేతగా ఆయనను కొనియాడారు. ‘‘వాళ్లు నీ గురించి ఏమన్నా, నీకు వ్యతిరేకంగా ఏం చేసినా నువ్వు మాత్రం దృఢంగా నిలబడ్డావు. ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి పోలేదు. నీ సంకల్పాన్ని వాళ్లు శంకించారు. నీకు వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేశారు. అయినా.. సత్యసాధన కోసం జరుపుతున్న పోరాటాన్ని నువ్వు ఆపలేదు. నిత్యం వాళ్లు నీ పట్ల విద్వేషం, ఆగ్రహాలను ప్రదర్శించినా, వాటిని నువ్వు మాత్రం నీ దరికి కూడా రానీయలేదు. నీకు సోదరిని అయినందుకు గర్విస్తున్నాను’’ అని ప్రియాంక అన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 05:56 AM

Advertising
Advertising