Bihar: బిహార్‌లో కూలిన మరో వంతెన
ABN, Publish Date - Jun 27 , 2024 | 08:37 PM
బిహార్‌లో మరో వంతెన కూలిపోయింది. కిషన్‌గంజ్ జిల్లాలో బన్సుబరి శ్రవణ్ చౌక్ వద్ద మరియా నది ఉపనదిపై నిర్మించిన వంతెన గురువారం కూలిపోయింది. దీంతో బిహార్‌లో వారం రోజుల్లో నాలుగు వంతెనలు కూలిపోయినట్లు అయింది.
పట్నా, జూన్ 27: బిహార్‌లో మరో వంతెన కూలిపోయింది. కిషన్‌గంజ్ జిల్లాలో బన్సుబరి శ్రవణ్ చౌక్ వద్ద మరియా నది ఉపనదిపై నిర్మించిన వంతెన గురువారం కూలిపోయింది. దీంతో బిహార్‌లో వారం రోజుల్లో నాలుగు వంతెనలు కూలిపోయినట్లు అయింది. భారీ వర్షం తాకిడికి ఈ వంతెన కూలిపోయిందని స్థానికులు పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు.
13 ఏళ్ల క్రితం అంటే గ్రామీణ పనుల విభాగం రూ. 25 లక్షల వ్యయంతో ఈ 70 మీటర్లు పొడవైన వంతెనను నిర్మించారని వారు తెలిపారు. ఇక ఈ నిర్మాణం పూర్తయి.. ప్రారంభించిన 6 సంవత్సరాలకే వంతెన దెబ్బతిందని వారు వివరించారు. ఈ వంతెన కూలిపోవడం అవినీతి ఎంత ప్రబలంగా ఉందనేందుకు నిదర్శనమని వారు స్పష్టం చేశారు. అంతేకాదు మరో కొత్త వంతెనను నిర్మించాలని ప్రభుత్వాన్ని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే... దిఘల్‌బ్యాంక్ బ్లాక్‌లోని తులసియా నుంచి ప్రధాన రహదారిని జయనగర్, లోహద్గడకు ఈ మార్గం కలుపుతుంది. ఇది జాతీయ రహదారి 327ఈ కు అనుసంధానించ బడుతుందని తెలిపారు. గత వారం రోజుల్లో సివాన్, అరారియా జిల్లాల్లో వంతెనలు కుప్పుకూలిన సంగతి తెలిసిందే. మరోవైపు.. కూలిన వంతెన అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 27 , 2024 | 08:40 PM