ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Indian Railways: ఏప్రిల్‌లో భారీగా పెరిగిన డిమాండ్.. 60 శాతం అదనపు సర్వీసులు నడిపిన రైల్వే శాఖ

ABN, Publish Date - Apr 26 , 2024 | 05:19 PM

ఏప్రిల్ నెలలో రైలు సర్వీసులకు భారీ డిమాండ్ కనిపించింది. ఒకటవ తారీఖు నుంచి 21 వరకూ మొత్తం 41.16 కోట్ల మంది రైళ్లల్లో ప్రయాణించారు. ఓవైపు ఎన్నికలు, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ అమాంతంగా పెరిగి రైల్వే శాఖపై ఒత్తిడి పెంచింది.

ఇంటర్నెట్ డెస్క్: ఏప్రిల్ నెలలో రైలు సర్వీసులకు భారీ డిమాండ్ (Demand Surge) కనిపించింది. ఒకటి నుంచి 21 వరకూ మొత్తం 41.16 కోట్ల మంది రైళ్లల్లో ప్రయాణించారు. ఓవైపు ఎన్నికలు, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ అమాంతంగా పెరిగి రైల్వే శాఖపై (Indian Railways) ఒత్తిడి పెంచింది. ఏప్రిల్ 20, 21 రోజుల్లో ఏకంగా 3.38 కోట్ల మంది రైల్వేను ఆశ్రయించడంతో అదనంగా 10 వేల రైళ్లను నడపాల్సి వచ్చింది. గతంలో పోలిస్తే రైళ్లకు డిమాండ్ 60 శాతం పెరిగిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, డిమాండ్‌కు తగ్గట్టుగా అదనపు సర్వీసులను రైల్వే శాఖ సిద్ధం చేస్తోంది. వెస్టర్న్ రైల్వే, నార్త్ వెస్టర్న్ రైల్వే, సౌత్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్ రైల్వేకు పెద్ద సంఖ్యలో అదనపు రైలు సర్వీసులు నడుపుతున్నాయి.

Lok Sabha Elections 2024: మోదీలో టెన్షన్ కనిపిస్తోంది, స్టేజిపై కన్నీళ్లు కూడా పెట్టుకోవచ్చు: రాహుల్


రైల్వే స్టేషన్లలో రద్దీ నియంత్రణకు రైల్వే ఉన్నతాధికారులు, ఆర్పీఎఫ్ సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు. జనరల్ బోగీల్లో ఎక్కేందుకు క్యూ పద్ధతి అమలు చేస్తున్నారు. గతేడాది ఇదే నెలలో 37 కోట్ల మంది రైలు ప్రయాణాలు చేశారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2019లో ఇదే నెలలో రైలు ప్రయాణికుల సంఖ్య 35 కోట్లుగా ఉంది (April tests Indian Railways, 60% more trains planned to meet voting, wedding surge).

ఎండాకాలం కావడంతో ప్రయాణికులు ఏసీ టిక్కెట్లు అధికంగా బుక్ చేసుకుంటున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా దూరప్రయాణాల రైళ్ల విషయంలో ఈ ట్రెండ్ స్పష్టంగా ఉందని తెలిపాయి. విమాన టిక్కెట్ల రేట్లు పెరగడం కూడా ప్రయాణికులు రైళ్ల వైపు మొగ్గు చూపడానికి ఓ కారణమని చెబుతున్నాయి. సామర్థ్యం పెంపు కోసం రైల్వే శాఖ గత కొన్నేళ్లుగా శ్రమిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలో డిమాండ్ పెరగడం సాధారణ విషయమేనని అంటున్నాయి.

Read Latest National and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 05:29 PM

Advertising
Advertising