ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Himant Biswa Sarma: అసెంబ్లీలో 2 గంటల నమాజ్ బ్రేక్ రద్దు.. సీఎం సంచలన నిర్ణయం

ABN, Publish Date - Aug 30 , 2024 | 07:18 PM

అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతి శుక్రవారం రెండు గంటల పాటు ఇచ్చే నమాజ్ విరామాన్ని రద్దు చేస్తున్నట్టు శుక్రవారంనాడు శాసనసభలో ప్రకటించారు. సభా కార్యక్రమాల ప్రొడక్టివిటీని పెంచడంతో పాటు వలస కాలం నాటి పద్ధతులను తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అభివర్ణించారు.

దిస్పూర్: అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ (Himanta Biswa Sharma) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతి శుక్రవారం రెండు గంటల పాటు ఇచ్చే నమాజ్ విరామాన్ని రద్దు చేస్తున్నట్టు శుక్రవారంనాడు శాసనసభలో ప్రకటించారు. సభా కార్యక్రమాల ప్రొడక్టివిటీని పెంచడంతో పాటు వలస కాలం నాటి పద్ధతులను తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అభివర్ణించారు. కాలం చెల్లిన 'జుమ్మా' విరామాన్ని రద్దు చేసేందుకు మద్దతు ఇచ్చిన అసెంబ్లీ స్పీకర్, ఇతర శాసనసభ్యులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలో శుక్రవారంనాడు అనుసరించే రెండు గంటల విరామ సమయాన్ని 1937లో ముస్లిం లీగ్‌కు చెందిన సైయద్ సాదుల్లా ప్రవేశపెట్టారు.


కాగా, దీనికి ముందు ముస్లిం వివాహాలు, విడాకులను తప్పని సరిగా రిజిస్టర్ చేయాలనే బిల్లును కూడా గత గురువారంనాడు హిమంత్ బిస్వా ప్రభుత్వం ఆమోదించింది. ఈ బిల్లుతో కాజీ వ్యవస్థ రద్దు కావడంతో పాటు బహుభార్యత్వం, బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడుతుందని, బాలికల అభ్యున్నతికి దోహద పడుతుందని సీఎం చెప్పారు.

Champai Soren: వీడిన ఉత్కంఠ.. బీజేపీలో చేరిన చంపయీ సోరెన్


చీప్ పాపులారిటీ కోసమే: తేజస్వి

శుక్రవారాల్లో ముస్లిం శాసనసభ్యులు నమాజ్ చేసుకునేందుకు ఉద్దేశించిన రెండు గంటల విరామాన్ని అసోం ప్రభుత్వం రద్దు చేయడాన్ని బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తప్పుపట్టారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని చీప్ పాపులారిటీ కోసం అసోం సీఎం ఇలాంటి చర్యలకు పాల్పడినట్టు విమర్శించారు. ముస్లింలను సాఫ్ట్ టార్గెట్‌గా బీజేపీ తీసుకుందని ఆరోపించారు. సమాజంలో విద్వేష వ్యాప్తే వారి ఉద్దేశమని, స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింలు కూడా త్యాగాలు చేశారనే విషయాన్ని బీజేపీ విస్మరించరాదని తేజస్వి అన్నారు. కాగా, దశాబ్దాలుగా అమల్లో ఉన్న సంప్రదాయాన్ని మార్చాల్సిన అవసరం ఏముందని ఏఐయూడీఎఫ్ ముస్లిం ఎమ్మెల్యే ఒకరు ప్రశ్నించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే హిమంత్ బిస్వా శర్మ సారథ్యంలోని అసోం బీజేపీ ప్రభుత్వం ముస్లింలను టార్గెట్‌గా చేసుకుందని ఆయన విమర్శించారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 30 , 2024 | 07:18 PM

Advertising
Advertising