ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Assam: యూనివర్సిటీలో మార్క్‌షీట్ స్కాం.. తొమ్మిది మంది అరెస్ట్

ABN, Publish Date - Jun 29 , 2024 | 04:45 PM

గౌహతి యూనివర్సిటీలో సంచలనం సృష్టించిన మార్క్‌షీట్ కుంభకోణం కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. వీరిలో కీలక సూత్రదారి కూడా ఉన్నారని తెలిపారు.

Gauhati University

గౌహతి, జూన్ 29: గౌహతి యూనివర్సిటీలో సంచలనం సృష్టించిన మార్క్‌షీట్ కుంభకోణం కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. వీరిలో కీలక సూత్రదారి కూడా ఉన్నారని తెలిపారు. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరం అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మ గురువారం బార్‌పేటలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. గౌహతి యూనివర్సిటీలో కంప్యూటర్ ఆపరేటర్‌కు అధిక మొత్తంలో నగదు చెల్లించి.. పలువురు విద్యార్థులు మార్క్‌షీట్స్‌లో మార్కులు పెంచుకున్నారని పేర్కొన్నారు. ఈ స్కామ్‌పై కేసు నమోదు అయిందన్నారు. ఈ కేసును బార్‌పేట్ పోలీసులతోపాటు సీఐడీ దర్యాప్తు చేస్తుందని వివరించారు. ఈ కేసు విచారణ సజావుగా వేగంగా జరుగుతుందన్నారు.

Also Read: Arvind Kejriwal: బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ‘ఆప్’ ఆందోళన

Also Read: Ayodhya: ఆరుగురు ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు


అయితే ఈ తరహా ఘటనలు ఇతర యూనివర్సిటీ్లో సైతం చోటు చేసుకుని ఉండవచ్చని ఈ సందర్భంగా సీఎం హేమంత్ బిశ్వ శర్మ సందేహం వ్యక్తం చేశారు. బార్‌పేట రోడ్‌లోని గణేష్‌లాల్ చౌదరి కాలేజీలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి మార్కులలో తీవ్ర వ్యత్యాసం ఉన్నట్లు కనుగొన్నారు. ఆ క్రమంలో ఈ మార్కుల వ్యత్యాసాన్ని గుర్తించడం ద్వారా ఈ మార్క్‌షీట్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కుంభకోణంలో భాగస్వామ్యులైన కాలేజీ విద్యార్థులను ఇప్పటికే అసోంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: Viral Video: గోదావరిలో దూకిన మహిళ..సోషల్ మీడియాలో వైరల్

Also Read: Owaisi: నివాసంపై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

Latest Telugu News And National News

Updated Date - Jun 29 , 2024 | 04:48 PM

Advertising
Advertising