Assam: సర్కార్ సంచలన నిర్ణయం.. 'శ్రీ భూమి'గా కరీమ్‌గంజ్ జిల్లా
ABN, Publish Date - Nov 19 , 2024 | 08:52 PM
పేరు మార్పునకు అసోం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి శర్మ మంగళవారంనాడు ప్రకటించారు. కొద్దికాలంగా రాష్ట్రంలోని పలు గ్రామాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మార్పుచేసింది.
గువాహటి: ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) సారథ్యంలోని అసోం (Assam) బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరీమ్‌గంజ్ జిల్లా (Karimganj District) పేరును 'శ్రీ భూమి' (Sri Bhoomi)గా మార్చింది. పేరు మార్పునకు అసోం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి శర్మ మంగళవారంనాడు ప్రకటించారు. కొద్దికాలంగా రాష్ట్రంలోని పలు గ్రామాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మార్పుచేసింది. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా పేరు శ్రీభూమిగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Mallikarjun Kharge: మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు జోక్యం చేసుకోవాలి.. రాష్ట్రపతికి ఖర్గే లేఖ
''వందేళ్ల క్రితం కవిగురు రవీంద్రనాథ్ ఠాగూర్ ఇప్పటి కరీమ్‌గంజ్ జిల్లాను 'శ్రీ భూమి'గా అభివర్ణించారు. మహాలక్ష్మి నివసించిన భూమి ఇది. శ్రీభూమి పేరును పునరుద్ధరించాలని చాలాకాలంగా ప్రజల కోరుతున్నారు. వారి ఆకాంక్షలను నెరవేరుస్తూ పేరు మార్పునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది'' అని ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. డిక్షనరీ రిఫరెన్స్‌లు, చారిత్రక సాక్ష్యాలు లేకున్నా పేర్లు మార్పును తమ ప్రభుత్వం కొనసాగిస్తోందని, ఇదొక నిరంతర ప్రక్రియ అని ఆయన చెప్పారు.
పంచాయతీ ఎన్నికలు, గ్లోబల్ సమ్మిట్
కాగా, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోసం ఎన్నికల జాబితాను డిసెంబర్‌లోగా ప్రచురించాలని కూడా అసోం మంత్రివర్గం మంగళవారంనాడు నిర్ణయించింది. 2025 ఫిబ్రవరి 10లోగా ఎన్నికలను పూర్తి చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. 2025 ఫిబ్రవరి 24న గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనే మరో కీలక నిర్ణయాన్ని కూడా క్యాబినెట్ తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించగా, ఆయన పాల్గొనేందుకు అంగీకారం తెలిపారు. ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు రాబోయే నెలల్లో భారతదేశ ప్రధాన నగరాలు, విదేశాల్లో రోడ్‌షోలు నిర్వహించాలని కూడా ఆసోం సర్కార్ నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి...
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి కారుపై రాళ్ల దాడి
అమెరికా పోలీసుల అదుపులో అన్మోల్ బిష్ణోయ్
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Nov 19 , 2024 | 08:52 PM