APY: దాదాపు 7 కోట్లకు చేరిన అటల్ పెన్షన్ యోజన సబ్‌స్క్రైబర్ల సంఖ్య
ABN, Publish Date - Sep 22 , 2024 | 03:52 PM
వృద్ధాప్యంలో ఆర్థికంగా ఆసరా ఇచ్చే అటల్ పెన్షన్ యోజన పథకం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 6.9 కోట్లుకు చేరినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: వృద్ధాప్యంలో ఆర్థికంగా ఆసరా ఇచ్చే అటల్ పెన్షన్ యోజన పథకం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 6.9 కోట్లుకు చేరినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తాజాగా పేర్కొన్నారు. పెన్షన్ ఫండ్ నిధి రూ.35,149 కోట్లుగా ఉన్నట్టు వెల్లడించారు. ‘‘2015లో ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి 6.9 కోట్ల మంది అటల్ పెన్షన్ యోజన పథకం లబ్ధిదారులుగా మారారు. పెన్షన్ ఫండ్ రూ.35,149కి చేరింది’’ అని ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం ప్రారంభోత్సవంలో మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
Kejriwal Quesitons Mohan Bhagat: ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు కేజ్రీవాల్ 5 సూటి ప్రశ్నలు
తక్కువ ఖర్చుతో పింఛను సదుపాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం లబ్ధిదారులకు 60 ఏళ్లు దాటాక నెలకు రూ.1000 నుంచి రూ.5 వేల వరకూ పెన్షన్ అందుతుంది. లబ్ధిదారులు పథకంలో పెట్టిన పెట్టుబడిని బట్టి వచ్చే పింఛను ఆధార పడి ఉంటుంది. పెన్షన్ సబ్‌స్క్రైబర్ మరణించిన పక్షంలో వారి భాగస్వామికి ఈ పింఛను అందజేస్తారు. సబ్‌స్క్రైబర్‌తో పాటు వారి జీవితభాగస్వామి కూడా మరణిస్తే వారి సంతానానికి పెన్షన్ కార్పస్‌ను పూర్తిగా అందజేస్తారు.
Jammu and Kashmir: పాక్‌తో చర్చల ప్రసక్తి లేదు: అమిత్‌షా
Updated Date - Sep 22 , 2024 | 03:58 PM