ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Water Crisis: అమరణ నిరాహార దీక్ష విరమించిన మంత్రి అతిషి

ABN, Publish Date - Jun 25 , 2024 | 02:33 PM

ఢిల్లీ నీటి శాఖ మంత్రి అతిషి తన అమరణ నిరాహార దీక్షను విరమించారు. తీవ్ర అనార్యోగానికి గురికావడంతో మంగళవారం తెల్లవారుజుమున ఆమె స్థానిక లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ (ఎల్‌ఎన్‌జేపీ)ఆసుపత్రిలో చేరారు.

న్యూడిల్లీ, జూన్ 25: ఢిల్లీ నీటి శాఖ మంత్రి అతిషి తన అమరణ నిరాహార దీక్షను విరమించారు. తీవ్ర అనార్యోగానికి గురికావడంతో మంగళవారం తెల్లవారుజుమున ఆమె స్థానిక లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ (ఎల్‌ఎన్‌జేపీ)ఆసుపత్రిలో చేరారు. మంత్రి అతిషి షుగర్ లెవెల్స్ 36కి పడిపోయాయని... దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించామని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది.

Also Read: Rail Roko: హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట


ఢిల్లీలో మంచి నీటి సరఫరా డిమాండ్ చేస్తూ మంత్రి అతిషి గత అయిదు రోజులుగా అమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో సోమవారం రాత్రి వైద్యులు ఆమెను పరీక్షించారు. ఆరోగ్యం బాగా క్షీణించిందని.. వెంటనే ఆసుపత్రిలో చేరాలని మంత్రి అతిషికి వైద్యులు సూచించారు. లేకుంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశముందన్నారు. దాంతో మంగళవారం తెల్లవారుజామును మంత్రి అతిషి.. తన దీక్ష విరమించారు. అనంతరం ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చేరారు.

Also Read: CM Tour: కుప్పంలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం


ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉన్నారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందన్నారు. హర్యానా నుంచి ఢిల్లీకి చట్టబద్దంగా రావాల్సిన నీటిని విడుదల చేయాలంటూ మంత్రి అతిషి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు ఢిల్లీలో మంచి నీటి కొరతపై ప్రధాని మోదీకి లేఖ రాస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో మంచి నీటి కొరత అంశాన్ని విపక్షాలతో కలిసి పార్లమెంట్‌లో లెవనెత్తుతామని ఆయన స్పష్టం చేశారు.

For Latest News and National News click here

Updated Date - Jun 25 , 2024 | 02:33 PM

Advertising
Advertising