ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

శిల్పాశెట్టి దంపతుల ఆస్తుల అటాచ్‌

ABN, Publish Date - Apr 19 , 2024 | 04:15 AM

బిట్‌కాయిన్స్‌ పేరుతో జరిగిన మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.97.79 కోట్ల విలువైన ఆస్తులను

బిట్‌కాయిన్స్‌ మోసం కేసులో ఈడీ చర్యలు

అటాచ్‌ అయిన ఆస్తుల విలువ రూ.98 కోట్లు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18: బిట్‌కాయిన్స్‌ పేరుతో జరిగిన మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.97.79 కోట్ల విలువైన ఆస్తులను గురువారం అటాచ్‌ చేశారు. అటాచ్‌ అయిన స్థిర, చరాస్తుల్లో ముంబైలోని జుహూలో శిల్పాశెట్టి పేరిట ఉన్న ఓ ఫ్లాట్‌, పుణెలోని ఓ బంగ్లా, శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా పేరిట ఉన్న ఈక్విటీ షేర్లు ఉన్నాయి. 2017లో ముంబైకి చెందిన ‘వేరియబుల్‌ ప్రై వేట్‌ లిమిటెడ్‌’ అనే సంస్థ బిట్‌కాయిన్స్‌ స్కామ్‌ను ప్రారంభించింది. బిట్‌కాయిన్లలో పెట్టుబడి పెడితే.. నెలకు 10ు లాభాలుంటాయని ఆశ చూపింది. మల్టీలెవల్‌ మార్కెటింగ్‌(ఎంఎల్‌ఎం- చైన్‌స్కీమ్‌) పద్ధతిలో ముంబై, ఢిల్లీల్లో ఏజెంట్లను నియమించుకుని, రూ.6,600 కోట్లను వసూలు చేసింది. గత ఏడాది ఈ కేసులో ఆ సంస్థకు చెందిన పలువురు వ్యక్తులను ఈడీ అరెస్టు చేసింది. ప్రధాన నిందితులు అజయ్‌ భరద్వాజ్‌, మహేందర్‌ భరద్వాజ్‌ పరారీలో ఉండగా.. వారికి చెందిన రూ.69 కోట్ల ఆస్తులను ఈడీ ఇప్పటికే అటాచ్‌ చేసింది. ఈ కేసులో రాజ్‌కుంద్రా 285 బిట్‌కాయిన్లను కలిగి ఉన్నారని.. వాటి విలువ రూ.150 కోట్లుగా ఉంటుందని ఈడీ తెలిపింది. అయితే.. తమకు కోర్టులో న్యాయం జరుగుతుందని రాజ్‌కుంద్రా మీడియాకు చెప్పారు.

Updated Date - Apr 19 , 2024 | 04:15 AM

Advertising
Advertising