Jallikattu: జల్లికట్టులో అపశృతి..ఇద్దరు పోలీసులతో సహా 45 మందికి గాయాలు
ABN, Publish Date - Jan 15 , 2024 | 05:17 PM
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే జల్లికట్టు క్రీడలో తాజాగా అపశృతి చోటుచేసుకుంది. అవనియాపురం జల్లికట్టు కార్యక్రమంలో ఇద్దరు పోలీసులతో సహా 45 మంది గాయపడ్డారు. మరికొంత మందిని ఆసుపత్రికి తరలించారు.
తమిళనాడు మదురైలోని అవనియాపురం జల్లికట్టు(Jallikattu) కార్యక్రమంలో సోమవారం అపశృతి చోటుచేసుకుంది. పోలీసులతో సహా 45 మంది గాయపడ్డారు. ఈ క్రమంలో గాయపడిన వారిని మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Ayodhya Ram Temple: ప్రాణప్రతిష్ఠ సమయం ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..
ఇక జల్లికట్టు అనేది పొంగల్ వేడుకల్లో భాగంగా తమిళనాడు(tamilnadu) రాష్ట్రంలో ఎక్కువగా జరుపుకునే పురాతన క్రీడ. ఈ క్రీడలో ఒక ఎద్దును ప్రజల సమూహంలోకి విడుదల వదులుతారు. ఆ తర్వాత ఎద్దు వెనుక ఉన్న పెద్ద మూపురాన్ని పట్టుకుని దానిని ఆపడానికి అనేక మంది ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మదురైలో జల్లికట్టును సోమవారం ప్రారంభించారు. ఆ కార్యక్రమం కోసం 1,000 ఎద్దులు, 600 వ్యక్తుల పేర్లు కూడా నమోదు చేయబడ్డాయి. మరో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
అయితే ఈ క్రీడలో గాయపడే ప్రమాదం ఉన్నందున పాల్గొనేవారికి, ఎద్దు(bull) విషయంలో జంతు హక్కుల సంస్థలు ఈ క్రీడపై నిషేధం విధించాలని పిలుపునిచ్చాయి. అయితే నిషేధానికి వ్యతిరేకంగా ప్రజల సుదీర్ఘ నిరసనల తర్వాత 2023 మేలో తమిళనాడు ప్రభుత్వం ఎద్దులను మచ్చిక చేసుకునే క్రీడ 'జల్లికట్టు'ను అనుమతించే చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.
Updated Date - Jan 15 , 2024 | 05:17 PM