ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MS Dhoni: అయోధ్యకు రావాలని ధోనికి ఆహ్వానం

ABN, Publish Date - Jan 16 , 2024 | 02:45 PM

అయోధ్య రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి అయోధ్య రామ మందిరం నుంచి ఆహ్వానం అందింది. శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు సభ్యులు ధోనిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.

రాంచీ: అయోధ్య రామమందిరం (Ayodhya Ram Temple) ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni)కి అయోధ్య రామ మందిరం నుంచి ఆహ్వానం అందింది. శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు సభ్యులు ధోనిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆర్ఎస్ఎస్ కో-ప్రావిన్స్ సెక్రటరీ ధనంజయ్ సింగ్, బీజేపీ నేత కర్మవీర్ సింగ్ కలిసి రాంచీలోని జార్ఖాండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వద్ద ధోనికి ఈ ఆహ్వాన పత్రిక అందజేశారు.


జార్ఖాండ్ రాష్ట్రానికి గర్వకారణమైన ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని కలిసి ధనంజయ్ సింగ్, కర్మవీర్ సింగ్ ఆహ్వానం అందించినట్టు బీజేపీ జార్ఘాండ్ విభాగం ఒక ట్వీట్‌లో తెలియజేసింది. ధోనితో కలిసి జార్ఖాండ్‌కు చెందిన 16 మందికి ఇంతవరకూ ఆహ్వాన పత్రికలు అందాయి. వీరిలో బీజేపీ నేత, పద్మభూషణ్ కురియా ముందా, పద్మశ్రీ ముకుంద్ నాయక్, పద్మశ్రీ ఆర్చర్ దీపిక కుమారి, ఏజేఎస్‌యూ పార్టీ చీఫ్ సుదేశ్ మహతో తదితరులు ఉన్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్‌కు సైతం ఇటీవల అయోధ్య ఈవెంట్‌కు రావాలని ఆహ్వానాలు అందాయి.


అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ఈనెల 16 నుంచి 21వ తేదీ వరకూ జరగనున్నాయి. జనవరి 18న ఆలయ గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహాన్ని ఉంచుతారు. 22వ తేదీ మధ్నాహ్నం 12.20 గంటలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొదలై 2.00 గంటలకు ముగుస్తుంది. వారణాసికి చెందిన జ్ఞానేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు.

Updated Date - Jan 16 , 2024 | 02:45 PM

Advertising
Advertising