ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayodhya: రామయ్యకు పొరుగు దేశం నుంచి అభిషేక జలం.. కశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు

ABN, Publish Date - Jan 20 , 2024 | 11:44 AM

అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. ఈ నెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది. అదే రోజు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరగనుంది.

అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. ఈ నెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది. అదే రోజు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరగనుంది. ఈ అద్భుత ఘట్టం కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశంలోని నలుమూలల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి రామ భక్తులు భారీ ఎత్తున కానుకలు పంపిస్తున్నారు. కశ్మీర్, తమిళనాడు, అప్ఘానిస్థాన్ నుంచి రామ మందిరానికి కానుకలు వచ్చాయి. కశ్మీర్‌లోని ముస్లిం సోదరులు, సోదరీమణులు అయోధ్య రామయ్యకు 2 కిలోల సేంద్రీయ కుంకుమ పువ్వును అందజేశారు.


కశ్మీర్, తమిళనాడు, అప్ఘానిస్థాన్ నుంచి వచ్చిన కానుకలను విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ అందుకున్నారు. సదరు కానుకలను ఆయన శ్రీరామ దేవాలయం 'యజ్మాన్' అనిల్ మిశ్రాకు అందజేశారు. అలోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కశ్మీర్‌కు చెందిన ముస్లిం సోదరసోదరీమణులు సేంద్రీయ పద్దతిలో పండించిన 2 కిలోల స్వచ్ఛమైన కుంకుమ పువ్వును రామయ్యకు కానుకగా ఇచ్చారు. తమిళనాడుకు చెందిన పట్టు తయారీదారులు శ్రీరాముని ఆలయాన్ని చిత్రీకరించే సిల్క్ బెడ్‌షీట్‌ రామయ్య కోసం పంపారు. పొరుగు దేశం అప్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో ప్రవహించే కుభా(కాబూల్) నది జలాన్ని శ్రీ రాముడి అభిషేకం కోసం పంపించారు.


అలాగే కనౌజ్‌ నుంచి వివిధ రకాల అత్తరులు, అమరావతి నుంచి 500 కిలోల కుంకుమ, ఢిల్లీ నుంచి రామాలయాల్లో సేకరించిన ధాన్యం అయోధ్యకు చేరుకున్నాయి. ఇవేకాకుండా 108 అడుగుల అగరుబత్తీ, 2,100 కిలోల గంట, 1,100 కిలోల భారీ దీపం, బంగారు పాదుకలు, పది అడుగుల తాళం, ఏకకాలంలో 8దేశాల సమయాన్ని సూచించే గడియారం ట్రస్టుకు అందాయి. సీతమ్మ జన్మస్థలం నేపాల్‌లోని జనక్‌పూర్‌ ధామ్‌ నుంచి వెండి పాదరక్షలు, ఆభరణాలు, వస్త్రాలతో పాటు 3వేలకు పైగా బహుమతులు కాన్వాయ్‌గా వచ్చాయి. శ్రీలంక ప్రతినిధి బృందం అశోకవాటిక నుంచి ప్రత్యేక కానుక తీసుకొచ్చింది. ఉజ్జయిని మహాకాలేశ్వర్‌ ఆలయం నుంచి 5లక్షల లడ్డూలతో కూడిన ట్రక్‌ శుక్రవారం అయోధ్యకు బయల్దేరింది. మధురలోని శ్రీకృష్ణ జన్మస్థాన్‌ నుంచి 200 కిలోల లడ్డూలు, తిరుమల శ్రీవారి ఆలయం నుంచి లక్ష లడ్డూలు పంపారు. భక్తుల కోసం 7వేల కిలోల రామ్‌ హల్వాను తయారు చేయనున్నట్లు నాగపూర్‌కు చెందిన చెఫ్‌ విష్ణు మనోహర్‌ ప్రకటించారు. రాముడికి బంగారు పూతపూసిన పాదరక్షలను సమర్పించడానికి హైదరాబాద్‌కు చెందిన 64ఏళ్ల చల్లా శ్రీనివాస శాస్త్రి 8వేల కిలోమీటర్లు నడిచి అయోధ్యకు చేరుకున్నారు.

Updated Date - Jan 20 , 2024 | 12:07 PM

Advertising
Advertising