Ram Mandir: అయోధ్య ప్రాణప్రతిష్ఠకు వెళ్లలేదని ఆందోళన చెందుతున్నారా.. ఇదిగో లైవ్‌లో చూసేయండి..
ABN, Publish Date - Jan 21 , 2024 | 05:59 PM
రేపటితో రామభక్తుల నిరీక్షణకు తెరపడనుంది. ఎందుకంటే జనవరి 22న రామ మందిర్ (Ram Mandir) ప్రాణ్ ప్రతిష్ట వేడుక జరగబోతోంది. అయితే ఈ కార్యక్రమానికి ఇప్పటికే అనేక మంది వెళుతుండగా...అక్కడికి వెళ్లలేని వారు సైతం ఇంట్లో ఫ్యామిలీతో కలిసి టీవీలో ప్రత్యక్షంగా లైవ్‌లో వీక్షించవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
రేపటి(జనవరి 22న) అయోధ్య రామ మందిర్(Ram Mandir) ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఇప్పటికే అనేక మంది వెళుతుండగా.. అక్కడికి వెళ్లలేని వారు సైతం ఇంట్లో ఫ్యామిలీతో కలిసి టీవీలో ప్రత్యక్షంగా లైవ్‌లో వీక్షించవచ్చు. అయితే ఏ ఛానెల్లో లైవ్ ప్రసారం జరుగుతుంది. ఏ సమయం నుంచి చూడాలనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
ఇక్కడ లైవ్ చూసేయండి..
మీరు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చూడడానికి అయోధ్యకు వెళ్లలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయోధ్యలో జరుగుతున్న ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో కూడా వీక్షించవచ్చు. లైవ్ స్ట్రీమింగ్ లింక్‌ను కింద ఇవ్వడం జరిగింది. అయోధ్యలో జరుగుతున్న రామాలయం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సహా, అధ్యాత్మిక కార్యక్రమాలన్నింటినీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకోసం ప్రత్యేక ప్రసారం అందిస్తోంది.
డీడీ న్యూస్ లైవ్..
ఈ కార్యక్రమం DD న్యూస్, దూరదర్శన్ జాతీయ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. అలాగే DD న్యూస్ YouTube ఛానెల్‌లో కూడా వీక్షించవచ్చు. డీడీ న్యూస్ అయోధ్యలోని పలు ప్రాంతాల్లో 40 కెమెరాలను ఏర్పాటు చేసింది. వాటి ద్వారా రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చూపించబడుతుంది. ప్రధాన ఆలయ ప్రాంగణంతో పాటు సరయూ ఘాట్ సమీపంలోని రామ్ కి పైడి, కుబేర్ తిలా వద్ద ఉన్న జటాయు విగ్రహం, ఇతర ప్రదేశాల నుంచి ప్రత్యక్ష ప్రసార దృశ్యాలను చూపిస్తారు. ఈ వేడుకను అత్యాధునిక 4కె టెక్నాలజీలో ప్రసారం చేయనున్నారు.
ఏ సమయంలో ప్రత్యక్ష ప్రసారం
రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న మధ్యాహ్నం 12:29 మధ్యాహ్నం 8 సెకన్ల నుంచి 12:30 నిమిషాల 32 సెకన్ల వరకు జరగనుంది. ఈ క్రమంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
ఆలయం గురించి తెలుసా?
నాగరా శైలిలో రామ మందిరాన్ని నిర్మించారు. ఈ ఆలయం మూడు అంతస్తులతో ఉంటుంది. ఆలయ సముదాయం మొత్తం 57 ఎకరాలు, అందులో 10 ఎకరాల్లో ఆలయం నిర్మించబడింది. ఆలయం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు, ఎత్తు 161 అడుగులు. ఆలయంలో 5 మంటపాలు, 318 స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభం ఎత్తు 14.6 అడుగులు ఉంది. ఆలయ పనులు 55 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు 2024 చివరి నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ అంటే గర్భగుడి సిద్ధంగా ఉంది. మొదటి అంతస్తు కూడా దాదాపు 80% పూర్తయింది.
Updated Date - Jan 21 , 2024 | 09:30 PM