ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాబు.. పవర్‌ఫుల్‌ సీఎం!

ABN, Publish Date - Nov 13 , 2024 | 05:57 AM

చంద్రబాబును అత్యంత శక్తిమంతుడైన ముఖ్యమంత్రిగా జాతీయ మీడియా సంస్థ ‘ఇండియాటుడే’ అభివర్ణించింది. దేశవ్యాప్తంగా శక్తిసంపన్నులైన వ్యక్తుల్లో ఆయన ఐదో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆయనకు ముందు తొలి నాలుగు స్థానాల్లో ప్రధాని మోదీ, ఆర్‌ఎ్‌సఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్‌ అగ్రనేత-లోక్‌సభలో ప్రతిపక్ష నేత

అత్యంత శక్తిమంతులైన టాప్‌ టెన్‌ నేతల్లో ఐదో స్థానం

‘ఇండియా టుడే’ కథనం.. మొదటి 4 ర్యాంకుల్లో మోదీ, భాగవత్‌, షా, రాహుల్‌

ఫీనిక్స్‌ పక్షిలా చంద్రబాబు పునర్జన్మ .. మీడియా సంస్థ కితాబు

న్యూఢిల్లీ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): చంద్రబాబును అత్యంత శక్తిమంతుడైన ముఖ్యమంత్రిగా జాతీయ మీడియా సంస్థ ‘ఇండియాటుడే’ అభివర్ణించింది. దేశవ్యాప్తంగా శక్తిసంపన్నులైన వ్యక్తుల్లో ఆయన ఐదో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆయనకు ముందు తొలి నాలుగు స్థానాల్లో ప్రధాని మోదీ, ఆర్‌ఎ్‌సఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్‌ అగ్రనేత-లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉండగా.. ఆయన తర్వాత బిహార్‌, యూపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ సీఎంలు నితీశ్‌కుమార్‌, యోగి ఆదిత్యనాథ్‌, ఎంకే స్టాలిన్‌, మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ అఽధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఉన్నారు. జనసేన, బీజేపీతో పొత్తుతో.. టీడీపీని పతనావస్థ నుంచి విజయతీరానికి చేర్చారని మంగళవారంనాటి ప్రత్యేక కథనంలో ఆకాశానికెత్తింది. జైలుకెళ్లడం ద్వారా రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి నుంచి ఫీనిక్స్‌ పక్షిలా పునర్జన్మ ఎత్తి.. అధికారం చేజిక్కించుకున్నారని, భారతీయ రాజకీయాల్లో కీలక నేతగా మారారని వెల్లడించింది. ఇవాళ చంద్రబాబు భారత్‌లోనే అత్యంత సీనియర్‌ ముఖ్యమంత్రి అని పేర్కొంది. హాలీవుడ్‌ థ్రిల్లర్‌ సినిమాల్లో మాత్రమే ఇలాంటి చరిత్రాత్మక పునరాగమనాలు చూస్తామని, అయితే చంద్రబాబు వాస్తవంగా చేసి చూపించారని వ్యాఖ్యానించింది. ‘లోక్‌సభలో టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీలను మినహాయిస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రమాదకర పరిస్థితుల్లో పడిపోతుంది. మెజారిటీ మార్కుకు దూరమవుతుంది. దీంతో పాలక ఎన్‌డీఏలో చంద్రబాబు పట్టు పెరిగింది. నాలుగోసారి సీఎం అయిన ఆయన.. తన చిరకాల స్వప్నమైన స్వర్ణాంధ్ర సాధన, రాజధాని అమరావతి నిర్మాణం లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది,. కార్పొరేట్లకు మిత్రుడిగా ఉండే చంద్రబాబు.. ఉమ్మడి రాష్ట్రానికి రెండోసారి సీఎం అయినప్పుడు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజనెస్‌ (ఐఎ్‌సబీ) ఏర్పాటుకు చొరవ చూపారు. ఇటీవల విజన్‌-2047 డాక్యుమెంట్‌ ఆవిష్కరించారు. 15 శాతం వృద్ధి రేటుతో 2047కల్లా ఆంధ్ర ఎకానమీని 2.4 ట్రిలియన్‌ డాలర్లకు, తలసరి ఆదాయాన్ని 43 వేల డాలర్లకు తీసుకెళ్లడం ఆయన లక్ష్యం. ప్రజల భాగస్వామ్యం ఉండే వ్యూహాన్ని అభివృద్ధి చేసే విజన్‌ కావాలని ఆయన ఎప్పుడూ అంటుంటారు’ అని పేర్కొంది.

Updated Date - Nov 13 , 2024 | 05:57 AM