ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bangladesh MP: సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం విడి భాగాలు

ABN, Publish Date - May 29 , 2024 | 01:51 PM

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్‌ అనర్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఆయన మృతదేహం విడి భాగాలు సెప్టిక్ ట్యాంక్‌లో ఉన్నట్లు గుర్తించామని ఆ దేశ పోలీస్ డిటెక్టివ్ విభాగం చీఫ్ హరుణ్ ఆర్ రషీద్ వెల్లడించారు.

కోల్‌కతా, మే 29: బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్‌ అనర్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఆయన మృతదేహం విడి భాగాలు సెప్టిక్ ట్యాంక్‌లో ఉన్నట్లు గుర్తించామని ఆ దేశ పోలీస్ డిటెక్టివ్ విభాగం చీఫ్ హరుణ్ ఆర్ రషీద్ వెల్లడించారు. బుధవారం కోల్‌కతాలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పరీక్షల కోసం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని తెలిపారు. ఇప్పటికే లభించిన అజీమ్ మృతదేహం విడిభాగాలు ఆయనవేనని పోరెన్సిక్ పరీక్షల్లో నిర్దారణ అయిందని స్పష్టం చేశారు.

Aadhaar-PAN Linking: రెండు రోజులే ఛాన్స్.. ఆ పని చేయలేదో ఇబ్బందులు తప్పవు..!

ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఇక ఈ కేసులో నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేశామని.. అలాగే బంగ్లాదేశ్‌లో ఈ కేసులో మరో నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం సరిపోయిందని హరుణ్ ఆర్ రషీద్ తెలిపారు. కోల్‌కతాలో దారుణ హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్య కేసు దర్యాప్తు కోసం ఆ దేశ డిటెక్టివ్ చీఫ్ హరణ్ ఆర్ రషీద్ ఆదివారం భారత్‌ వచ్చారు. ఆ క్రమంలో ఈ తరహా హత్య తాను ఇంత వరకు చూడలేదన్నారు. పక్కా ప్రణాళికతో ఇంత కిరాతకంగా హత్య కూడా చేస్తారా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఈ దారుణ హత్య వెనుక ఉన్న వాస్తవాలు బయటకు రావాలని ఆయన పేర్కొన్నారు.

MLA Pinnelli: పిన్నెల్లి పైశాచికం.. బ్రదర్స్ మాఫియాపై టీడీపీ బుక్ రిలీజ్.. ఇన్ని వేల కోట్ల ఆస్తులా..!?


మరోవైపు భారత్‌లో చికిత్స కోసం బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ మే 12న కోల్‌కతా వచ్చారు. ఆ క్రమంలో తన స్నేహితుడు గోపాల్ బిస్వాస్ నివాసంలో దిగారు. అయితే మే 13న వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్తున్నానని చెప్పి.. ఆయన బయటకు వెళ్లారు. అనంతరం ఇంటికి తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్‌లోని ఆయన కుటుంబ సభ్యులకు గోపాల్ బిశ్వాస్ సమాచారం ఇచ్చారు. వారి సూచనల మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

BJP: పవర్ ప్రాజెక్టులపేరుతో జగన్ భూసంతర్పణ: లంకా దినకర్

ఆ క్రమంలో ఎంపీ అన్వరుల్ దారుణ హత్యకు గురయ్యారని పోలీసులు నిర్ధారించారు. అందుకు సంబంధించిన నిందితుడిని సైతం అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో ఎంపీ అన్వరుల్ అజీమ్‌ను హత్య చేసి.. ఆయన మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి.. కోల్‌కత్తాలోని వివిధ ప్రాంతాల్లో పడేసినట్లు చెప్పారు. దాంతో నిందితులు చెప్పిన అంశాల ఆధారంగా ఆ యా ప్రాంతాల్లోని ఎంపీ మృతదేహానికి చెందిన విడి భాగాలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. ఆవి ఎంపీ అన్వరుల్ అజీమ్‌కు చెందినవేనని ఫోరెన్సిక్ నిర్ధారణ చేసింది. ఈ హత్య వెనుక ఉన్న వారిని భారత్‌కు తీసుకు వచ్చేందుకు ఇంటర్ పోల్ సాయం తీసుకుంటున్నామని హరుణ్ ఆర్ రషీద్ తెలిపారు.

For More National News and Telugu News..

Updated Date - May 29 , 2024 | 03:37 PM

Advertising
Advertising