ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bangladesh Protests: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నివాసం లూటీ.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

ABN, Publish Date - Aug 05 , 2024 | 08:34 PM

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో నెలకొన్న సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనలు చెలరేగడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయక తప్పలేదు. రాజీనామా అనంతరం హసీనా బంగ్లాదేశ్ నుంచి పరారై భారత్‌కు చేరుకున్నారు. ఇక్కడి నుంచి లండన్ వెళ్లబోతున్నారు.

Bangladesh PM House Occupied By Protestors

పొరుగు దేశం బంగ్లాదేశ్‌ (Bangladesh)లో నెలకొన్న సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనలు చెలరేగడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా (Sheikh Hasina) రాజీనామా చేయక తప్పలేదు. రాజీనామా అనంతరం హసీనా బంగ్లాదేశ్ నుంచి పరారై భారత్‌కు చేరుకున్నారు. ఇక్కడి నుంచి లండన్ వెళ్లబోతున్నారు. ప్రధాని పరారు కావడంతో ఆందోళనకారులు ఆమె ఇంటిని (Bangladesh PM House) చుట్టుముట్టారు. ఢాకాలోని ప్రధాని అధికార నివాసమైన గణభాబన్‌ను చుట్టుముట్టారు.


ప్రధాని అధికార నివాసంలోకి చొరబడిన ఆందోళనకారులు అక్కడ విధ్వంసం సృష్టించారు. ఇంట్లోని విలువైన వస్తువులును లూటీ చేశారు. మాంసం, చేపలు, కూరగాయలు, విలువైన ఫర్నిచర్‌ను ఆందోళకారులు పట్టుకెళ్లిపోయినట్టు స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. తన నివాసంలో ప్రధాని నిద్రపోయే మంచంపై కొందరు ఆందోళనకారులు పడుక్కున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రభుత్వం బలవంతంగా తీసుకొచ్చిన రిజర్వేషన్ వ్యవస్థపై విద్యార్థులు ప్రదర్శించిన తీవ్ర ఆగ్రహమే ఈ ఆందోళనలకు కారణం.


1971లో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి 2018లోనే ఈ కోటాను అమలు చేయాలని భావించారు. అప్పట్లో విద్యార్థుల ఆగ్రహ జ్వాలలకు జడిసి వెనక్కి తగ్గారు. జూన్ నెలలో ఈ కోటాను పునరుద్ధరిస్తూ బంగ్లా హైకోర్టు తీర్పునిచ్చింది. అప్పట్నుంచి ఆందోళనలు సాగుతున్నాయి. మధ్యలో కాస్త సద్దుమణిగినట్టు కనిపించిన నిరసనలు ఆదివారం ఒక్కసారిగా మిన్నంటాయి. దీంతో సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయడంతో పాటు నిరవధిక కర్ఫ్యూను విధించారు. అయితే కర్ఫ్యూను ఛేదించిన ఆందోళనకారులు ప్రధాని నివాసాన్ని ముట్టడించారు.

ఇవి కూడా చదవండి..

Waqf Act: వక్ఫ్ బోర్డు అంటే ఏంటి? చట్టం సవరణపై వివాదమెందుకు?


Bangladesh Clashes: భారత్ - బంగ్లా సరిహద్దుల్లో హైఅలర్ట్.. అదనపు బలగాలను మోహరిస్తున్న బీఎస్ఎఫ్


మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 05 , 2024 | 08:55 PM

Advertising
Advertising
<