Rs. 84 Crores: 108 కేజీల బంగారం సీజ్.. ఎక్కడంటే..?
ABN, Publish Date - Jul 10 , 2024 | 06:40 PM
లడఖ్ సమీపంలోని భారత్ - చైనా సరిహద్దు వద్ద అక్రమంగా తరలిస్తున్న 108 కేజీల బంగారాన్ని ఇండో టిబెటన్ సరిహద్దు భద్రత దళం (ఐటీబీపీ) స్వాధీనం చేసుకొంది. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసింది.
జమ్మూ కశ్మీర్, జులై 10: లడఖ్ సమీపంలోని భారత్ - చైనా సరిహద్దు వద్ద అక్రమంగా తరలిస్తున్న 108 కేజీల బంగారాన్ని ఇండో టిబెటన్ సరిహద్దు భద్రత దళం (ఐటీబీపీ) స్వాధీనం చేసుకొంది. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసింది. వారి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీబీటీ డిప్యూటీ కమాండెంట్ దీపక్ భట్ బుధవారం వెల్లడించారు. ఈ మొత్తం బంగారం.. 108 కడ్డీల రూపంలో ఉందని చెప్పారు.
Also Read: Pooja Khedkar : ట్రైయినీ ఐఏఎస్‌పై బదిలీ వేటు..
ఒక్కో బంగారపు కడ్డి ఒక కేజీ బరువు ఉందన్నారు. అయితే ఇంత భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం ఐటీబీటీ చరిత్రలో ఇదే తొలిసారి అని దీపక్ భట్ స్పష్టం చేశారు. ఈ స్వాధీనం చేసుకున్న మొత్తం బంగారాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులను అందజేసినట్లు తెలిపారు. వాస్తవాధీన నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో బంగారం స్మగ్లింగ్ జరుగుతున్నట్లు అంతకు కొద్దిసేపటి ముందే తమకు సమాచారం అందిందన్నారు.
Also Read: Minister Savitha: టీడీపీ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి
దీంతో సిబ్బందిని అప్రమత్తం చేసిన తనిఖీలు ముమ్మరం చేసినట్లు వివరించారు. ఆ క్రమంలో ఇద్దరు వ్యక్తుల వద్దనున్న వస్తువులను తనిఖీ చేసేందుకు ప్రయత్నించామన్నారు. వారు పారిపోయే ప్రయత్నం చేశారని.. దీంతో వారిని వెంబడించి.. తమ సిబ్బంది పట్టుకున్నారని చెప్పారు. వారి వస్తువులను తనిఖీ చేయగా.. బారీ ఎత్తున బంగారం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.
Also Read: Ganta Srinivas Rao: సీఎం దృష్టికి గురుకుల సమస్యలు
ఈ బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులను గుర్తించామని.. వారు లడఖ్ ప్రాంత వాసులని వెల్లడించారు. పోలీసులతోపాటు ఐటీబీటీ అధికారులు వారిని సంయుక్తంగా విచారిస్తున్నారని దీపక్ భట్ వివరించారు. ఇక వేసవి కాలంలో సరిహద్దు ప్రాంతంలో స్మగ్లింగ్ కార్యకలాపాలు అధికంగా ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో గస్తీని సైతం తీవ్రతరం చేసినట్లు ఆయన వివరించారు.
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 10 , 2024 | 06:43 PM