ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bihar: కొద్ది రోజుల్లో ప్రారంభోత్సవం.. అంతలోనే కూలిన వంతెన

ABN, Publish Date - Jun 18 , 2024 | 07:47 PM

బిహార్‌ అరారియా జిల్లాలో వంతెన కూలి పోయింది. కుర్సాకాంతా, సిక్తి మధ్య బాక్రా నదిపై నిర్మిస్తున్న వంతెన మంగళవారం కూలిపోయింది. దీంతో ఈ వంతెన నిర్మాణం కోసం ఖర్చు చేసిన రూ.12 కోట్లు నేలపాలైయ్యాయి.

పాట్నా, జూన్ 18: బిహార్‌ అరారియా జిల్లాలో వంతెన కూలి పోయింది. కుర్సాకాంతా, సిక్తి మధ్య బాక్రా నదిపై నిర్మిస్తున్న వంతెన మంగళవారం కూలిపోయింది. దీంతో ఈ వంతెన నిర్మాణం కోసం ఖర్చు చేసిన రూ.12 కోట్లు నేలపాలైయ్యాయి. మరికొద్ది రోజుల్లో ఈ వంతెన ప్రారంభం కానుంది. అలాంటి వేళ వంతెన కూలిపోవడంతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోపాటు ప్రభుత్వ విభాగానికి చెందిన అధికారుల కారణంగానే ఈ వంతెన కూలి పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Also Read: AP CM Chandrababu: పోలవరం ప్రాజెక్ట్ విధ్వంసం.. వెలుగు చూస్తున్న వాస్తవాలు


Also Read: బీజేపీ అగ్రనేతల బృందంపై సొంత పార్టీ కేడర్ గరం గరం

మరోవైపు వంతెన కూలిపోతున్న వీడియో.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఇక వంతెన కూలిపోవడంపై సమాచారం అందుకున్న స్థానిక నాయకుడు, సిక్తి ఎమ్మెల్యే విజయకుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే ఈ వంతెన కూలిపోయిందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై సంపూర్ణ విచారణ జరపాలని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

Also Read: ఎంపీగా ప్రియాంక గాంధీ పోటీ.. స్పందించిన రాబర్ట్ వాద్రా


Also Read: బాలాసోర్‌లో ఉద్రిక్తత.. కర్ఫ్యూ విధింపు

మరోవైపు ఈ ఏడాది మొదట్లో బిహార్‌లోని సుపౌల్‌లో కోసి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. రూ. 984 కోట్లతో నిర్మిస్తున్న వంతెన స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఆ క్రమంలో శిథిలాల కింద చిక్కుకున్న నిర్మాణ కార్మికులను స్థానికులు రక్షించారు. ఈ ఘటనలో ఒకరు మరణించారు. ఈ వంతెన కూలిపోవడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఓ వంతెన కూలిపోయిన కొన్ని నెలలకే.. అరారియా జిల్లాలో మరో వంతెన అది కూడా బిహార్‌లోనే కూలి పోవడం గమనార్హం.

Read Latest Telangana News and National News

Updated Date - Jun 18 , 2024 | 07:47 PM

Advertising
Advertising