Bihar: అవిశ్వాస తీర్మానంతో స్పీకర్ తొలగింపు
ABN, Publish Date - Feb 12 , 2024 | 03:13 PM
బీహార్‌లో నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైంది. సోమవారం బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా మొదలయ్యారు. తొలుత గవర్నర్ ప్రసంగం అనంతరం ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవథ్ బిహారీ చౌదరి పై అధికార పక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. తీర్మానానికి అనుకూలంగా 125 ఓట్లు వ్యతిరేకంగా 112 ఓట్లు పడటంతో స్పీకర్‌ను తొలగించారు.
పాట్నా: బీహార్ (Bihar)లో నితీష్ కుమార్ (Nithis Kumar) సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైంది. సోమవారం బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా మొదలయ్యారు. తొలుత గవర్నర్ ప్రసంగం అనంతరం ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవథ్ బిహారీ చౌదరి (Awadh Bihari Choudhary)పై అధికార పక్షం అవిశ్వాస తీర్మానం (No confidence motion) ప్రవేశపెట్టింది. తీర్మానానికి అనుకూలంగా 125 ఓట్లు వ్యతిరేకంగా 112 ఓట్లు పడటంతో స్పీకర్‌ను తొలగించారు.
మహాఘట్‌బంధన్ ప్రభుత్వానికి నితీష్ కుమార్ ఇటీవల రాజీనామా చేసి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేతో చేతులు కలిపారు. ఆ వెంటనే ముఖ్యమంత్రిగా తొమ్మిదోసారి నితీష్ ప్రమాణస్వీకారం చేశారు. ఆర్జేడీతో తెగతెంపులు కారణంగా ఆ పార్టీకి చెందిన చౌదరి స్పీకర్‌ను పదవి నుంచి తప్పుకోవాల ఎన్డీయే సర్కార్ కోరినప్పటికీ ఆయన నిరాకరించారు. దీంతో సోమవారంనాడు సభలో ఆయనపై అధికార పక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. తీర్మానం గెలవడంతో స్పీకర్ తప్పుకున్నారు. నితీష్ బలపరీక్ష నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ తమ ఎమ్మెల్యేలకు విప్‌లు జారీ చేశాయి.
Updated Date - Feb 12 , 2024 | 03:13 PM