ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rajya Sabha polls: 7 రాష్ట్రాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

ABN, Publish Date - Feb 11 , 2024 | 09:25 PM

రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను భారతీయ జనతా పార్టీ అదివారంనాడు ప్రకటించింది. బీహార్ నుంచి శ్రీమతి (డాక్టర్) ధర్మశీల గుప్తా, డాక్టర్ భీమ్ సింగ్‌, ఛత్తీస్‌గఢ్ నుంచి రాజా దేవేంద్ర ప్రతాప్ సింగ్, హర్యానా నుంచి శ్రీ సుభాష్ బారాల, కర్ణాటక నుంచి నారాయణ కృష్ణాసా బాండగే పోటీ చేయనున్నారు.

న్యూఢిల్లీ: రాజ్యసభ (Rajya Sabha) ద్వైవార్షిక ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను భారతీయ జనతా పార్టీ (BJP) అదివారంనాడు ప్రకటించింది. బీహార్ నుంచి శ్రీమతి (డాక్టర్) ధర్మశీల గుప్తా, డాక్టర్ భీమ్ సింగ్‌, ఛత్తీస్‌గఢ్ నుంచి రాజా దేవేంద్ర ప్రతాప్ సింగ్, హర్యానా నుంచి శ్రీ సుభాష్ బారాల, కర్ణాటక నుంచి నారాయణ కృష్ణాసా బాండగే, ఉత్తరాఖండ్ నుంచి మహేంద్ర భట్, పశ్చిమబెంగాల్ నుంచి సమిక్ భట్టాచార్య, ఉత్తరప్రదేశ్ నుంచి ఆర్‌పీఎన్ సింగ్, డాక్టర్ సుధాన్షు త్రివేది, చౌదరి తేజ్‌వీర్ సింగ్, సాధనా సింగ్, ఆమ్రపాల్ మౌర్య, సంగీత బల్వంత్, నవీన్ జైన్‌లను పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది.


ఈ ఏడాది మే మొదటి వారంలో 58 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్ అవుతున్నారు. వీరిలో 8 మంది కేంద్ర మంత్రులు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఉన్నారు. 239 మంది సభ్యుల రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి 93 మంది ఎంపీలు, కాంగ్రెస్‌కు 30 మంది, టీఎంసీకి 13 మంది ఎంపీలు ఉన్నారు. ఆరుగురు నామినేటెడ్ సభ్యులు సైతం ఉన్నారు.


కాగా, 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ సీట్లకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజ్యసభ స్థానాలకు, బీహార్‌-6, ఛత్తీస్‌గఢ్-1, గుజరాత్-4, హర్యానా-1, హిమాచల్ ప్రదేశ్-1, కర్ణాటక-4, మధ్యప్రదేశ్-5, మహారాష్ట్ర-6, తెలంగాణ-3, ఉత్తరప్రదేస్-10, ఉత్తరాఖండ్-1, పశ్చిమబెంగాల్-5, ఒడిశా-3, రాజస్థాన్ లో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

Updated Date - Feb 11 , 2024 | 09:25 PM

Advertising
Advertising