బీజేపీ నేత హెచ్. రాజాకు ఏడాదిజైలు శిక్ష
ABN, Publish Date - Dec 03 , 2024 | 03:52 AM
ద్రావిడ సిద్ధాంత పితామహుడు పెరియార్ విగ్రహాన్ని పగులగొడతానని ప్రకటించడం,
చెన్నై, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ద్రావిడ సిద్ధాంత పితామహుడు పెరియార్ విగ్రహాన్ని పగులగొడతానని ప్రకటించడం, డీఎంకే ఎంపీ కనిమొళిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసుల్లో బీజేపీ సీనియర్ నేత హెచ్.రాజాకు చెన్నై ప్రత్యేక కోర్టు ఒక్కో కేసులో ఆరు నెలల చొప్పున జైలుశిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. ద్రవిడ ఉద్యమనేత పెరియార్ విగ్రహాన్ని పగులగొడతానని హెచ్.రాజా 2018 ఏప్రిల్‌లో తన ఎక్స్‌పేజీలో ప్రకటించారు. అదే ఏడాది మార్చిలో డీఎంకే ఎంపీ కనిమొళిని కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు సంఘటనలకు సంబంధించి ఈరోడ్ నగర పోలీసులు, కరుంగల్‌పాళయం పోలీసులు కేసులు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయవేల్ ఈ పిటిషన్‌లపై విచారణ జరిపారు.
Updated Date - Dec 03 , 2024 | 03:52 AM