ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ranchi: జేఎంఎం, కాంగ్రెస్ రాజకీయ డ్రామా.. జార్ఖండ్ ఎమ్మెల్యేల తరలింపుపై బీజేపీ

ABN, Publish Date - Feb 03 , 2024 | 07:50 AM

జార్ఖండ్‌లోని జేఎంఎం(JMM) నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించడం.. జేఎంఎం, కాంగ్రెస్(Congress) నేతల మధ్య అంతర్గత విభేదాలను కప్పిపుచ్చే రాజకీయ ఎత్తుగడగా జార్ఖండ్ బీజేపీ అభివర్ణించింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ(BJP) ప్రయత్నిస్తోందన్న ఆరోపణను ఆ పార్టీ తిప్పికొట్టింది.

రాంచీ: జార్ఖండ్‌లోని జేఎంఎం(JMM) నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించడం.. జేఎంఎం, కాంగ్రెస్(Congress) నేతల మధ్య అంతర్గత విభేదాలను కప్పిపుచ్చే రాజకీయ ఎత్తుగడగా జార్ఖండ్ బీజేపీ అభివర్ణించింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ(BJP) ప్రయత్నిస్తోందన్న ఆరోపణను ఆ పార్టీ తిప్పికొట్టింది. “JMM నేతృత్వంలోని కూటమికి BJP నుండి ఎలాంటి ముప్పు లేదు. ఇరు పార్టీల మధ్య మంత్రి పదవులు, సీట్ల పంపకంపై సయోధ్య కుదరలేదు. దీంతో వారు తమ అంతర్గత విభేదాలను దాచడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల దృష్టి మరలడానికే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం హేమంత్ సోరెన్ ప్రభుత్వం అనేక న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకుంది.

దీనికితోడు కుటుంబ పాలన చెదపురుగు లాంటివని ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే చెబుతూ వస్తున్నారు. దేశంలో రాజవంశ రాజకీయాలకు వ్యతిరేకంగా వాతావరణం నెలకొనడంతో చంపై సోరెన్ సీఎం అయ్యారు’’ అని బీజేపీ సీనియర్ నేత అమర్ బౌరీ అన్నారు. చంపాయ్ సోరెన్ శుక్రవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, అధికార JMM నేతృత్వంలోని 38 సంకీర్ణ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించారు. జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ చంపయిను అభినందించారు. ప్రజల కోసం కష్టపడి పని చేయాలని సూచించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2024 | 07:51 AM

Advertising
Advertising