ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: వచ్చే వారమే బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్.. జాబితాలో మోదీ, షా!

ABN, Publish Date - Feb 24 , 2024 | 05:52 PM

సార్వత్రిక సమరం వేళ బీజేపీ(BJP) అధిష్టానం ఎన్నికలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ తొలి జాబితాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.

ఢిల్లీ: సార్వత్రిక సమరం వేళ బీజేపీ(BJP) అధిష్టానం ఎన్నికలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ తొలి జాబితాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బీజేపీ 100 మంది అభ్యర్థులతో కూడిన ఫస్ట్ లిస్టుని ఫిబ్రవరి 29న విడుదల చేయడానికి కసరత్తు చేస్తోంది. ఈ జాబితాలో బీజేపీ అగ్రనేతలు కూడా ఉంటారు.

ప్రధాని మోదీ(PM Modi), కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) పేర్లు ఈ లిస్టులో ఉండనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం గురువారం జరగగనుండగా.. ఆ మీటింగ్‌లోనే జాబితా విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలకుగానూ 370 స్థానాల్లో గెలుపొందాలని బీజేపీ లక్ష్యం నిర్దేశించుకుంది.


మొత్తంగా ఎన్డీఏ కూటమి 400 స్థానాల్లో గెలుపుబావుటా ఎగరేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 100 స్థానాల్లో గెలుపు గుర్రాలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ వారణాసి నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. 2014లో 3.37 లక్షల ఓట్లతో, 2019లో 4.8 లక్షల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. అమిత్ షా 2019 ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి పోటీ చేశారు. ఇటీవల జరిగిన బీజేపీ నేతల సమావేశంలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ గెలుపు కోసం ప్రతిఒక్కరు కష్టపడాలని.. రాబోయే 100 రోజులు కీలకమని చెప్పారు. ఈ సమయంలో ప్రతి లబ్ధిదారుడికి, ఓటరుకు చేరువ కావాలని సూచించారు. తాను మూడోసారి ప్రధాని కావాలని పని చేయట్లేదని.. దేశం కోసం పని చేయాలనుకుంటున్నట్లు మోదీ అన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 24 , 2024 | 05:52 PM

Advertising
Advertising