Elections : ‘పీఏలతో నడుస్తున్న పార్టీ’
ABN, Publish Date - Apr 07 , 2024 | 03:53 PM
కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నాయకుడు గౌరవ్ వల్లభ్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ పార్టీలోని మాజీ మంత్రుల వ్యక్తిగత సహాయకులు (పీఏ)తో ఆ పార్టీ నడుస్తుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఆదివారం న్యూఢిల్లీలో గౌరవ్ వల్లభ్ మాట్లాడుతూ.. తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 07: కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నాయకుడు గౌరవ్ వల్లభ్ (Gourav Vallabh) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ పార్టీలోని మాజీ మంత్రుల వ్యక్తిగత సహాయకులు (పీఏ)తో ఆ పార్టీ నడుస్తుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఆదివారం న్యూఢిల్లీలో గౌరవ్ వల్లభ్ మాట్లాడుతూ.. తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై ఆయన విమర్శలు గుప్పించారు.
గత 30 ఏళ్లుగా ఇదే వ్యక్తి మేనిఫెస్టోను తయారు చేస్తున్నారని గుర్తు చేశారు. ఓటర్లు, పార్టీ శ్రేణులకు సంబంధించిన విషయాలపై ఆ పార్టీకి కనీస అవగాహన లేదని మండిపడ్డారు. తరగతి గది పరిశీలించే వ్యక్తి.. ఎన్నికల బరిలో నిలిచినట్లుగా ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను కాలేజీలో విద్యనభ్యసిస్తున్నప్పుడు.. టీవీలో వచ్చిన ఆ అధికార ప్రతినిధే.. నేడు పార్టీలో కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
Arivind Kejriwal: ఆప్ నేతల నిరాహార దీక్ష
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గౌరవ్ వల్లభ్ రాజీనామా చేశారు. అయితే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జీ జైరామ్ రమేష్‌పై విరుచుకు పడ్డారు. అయితే ప్రస్తుతం ఎక్కడా జై రామ్ రమేస్ పేరు ప్రస్తావించకుండా పంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయనకు బలంతోపాటు యోగ్యత కూడా ఉండి ఉంటే.. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలకే ఎందుకు పరిమితమై ఉండేదని ఆయన ఈ సందర్భంగా సందేహం వ్యక్తం చేశారు. ఆయనకు పార్టీ పట్ల ఓ ఐడియాలజీ కానీ.. కమిట్‌మెంట్ కానీ లేవని కుండబద్దలు కొట్టారు. ఎంతసేపు తన రాజ్యసభ సీటు సంరక్షించుకోనే పనిలో ఆయన నిమగ్నమై ఉంటారని ఎద్దేవా చేశారు.
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీలో ఉందన్నారు. అందుకే అయోధ్య రామ మందిరం వేడుకల్లో ఆ పార్టీ నేతలు ఎవ్వరు పాల్గొనలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జనవరి 22వ తేదీన అయోధ్య రామమందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బీజేపీ పోలిటికల్ ఇవెంట్ అంటూ కాంగ్రెస్ పార్టీ అభివర్ణించిందన్నారు.
Lok Sabha Elections: భారీగా నగదు పట్టివేత
మరోవైపు ఏప్రిల్ 4వ తేదీన గౌరవ్ వల్లభ్.. కాంగ్రెస్ పార్టీలోని అన్ని పోస్టులకు రాజీనామా చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఆయన లేఖాస్త్రం సంధించారు. అనంతరం గౌరవ్ వల్లభ్ బీజేపీ గూటికి చేరారు.
మరిన్నీ జాతీయ వార్తలు కోసం ...
Updated Date - Apr 07 , 2024 | 04:05 PM