Bomb threat calls: శ్రీరామ్, వెంకటేశ్వర కాలేజిలకు బాంబు బెదిరింపులు
ABN, Publish Date - May 23 , 2024 | 07:11 PM
న్యూఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజి, శ్రీవెంకటేశ్వర కాలేజి ఆఫ్ ఢిల్లీ యూనివర్శిటీలకు గురువారం బాంబు బెదిరిపులు వచ్చాయి. దీంతో ఆ యా కాలేజి అధికారులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
న్యూఢిల్లీ, మే 23: న్యూఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజి, శ్రీవెంకటేశ్వర కాలేజి ఆఫ్ ఢిల్లీ యూనివర్శిటీలకు గురువారం బాంబు బెదిరిపులు వచ్చాయి. దీంతో ఆ యా కాలేజి అధికారులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బంది కాలేజికి చేరుకుని.. ముమ్మర తనిఖీలు చేపట్టారు.
AP Elections: పిన్నెల్లి ఇలా.. ఎలా దొరికిపోయాడు..!
అయితే బుధవారం న్యూఢిల్లీలోని కేంద్ర హోం శాఖ మంత్రి కార్యాలయానికి సైతం ఇదే తరహా బాంబు బెదిరింపులు అందాయి. దీంతో అప్రమత్తమై కార్యాలయ సిబ్బంది. ఆ తర్వాత బాంబు బెదిరింపు నకిలీదిగా తేల్చారు. అంతకు ముందు ఢిల్లీలోని పాఠశాలలు, ఆసుపత్రులకు సైతం ఇదే తరహా బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే గతంలో మూడు హోటల్స్‌కు సైతం బాంబు బెదిరింపులు వచ్చాయి.
LokSabha Elections: బీజేపీ షోకాజ్ నోటీసు.. స్పందించిన జయంత్ సిన్హా
ఇక ఈ తరహా బాంబు బెదిరింపులు ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని చాచా నెహ్రూ ఆసుపత్రికి బాంబు బెదిరింపు వచ్చింది. అనంతరం మే 1వ తేదీన ఢిల్లీలోని 150 పాఠశాలలకు ఇదే తరహాలో బాంబు బెదిరింపులు అందాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Video Viral: ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకెళ్లిన పోలీస్ వ్యాన్
అయితే ఈ మెయిల్ ద్వారా వచ్చిన ఈ బెదిరింపులు రష్యాకు చెందిన కంపెనీ నుంచి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. అలాగే ఢిల్లీలోని ఆసుపత్రులకు సైతం బాంబు బెదిరింపులు రావడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. దీంతో సైప్రస్‌కు చెందిన కంపెనీ నుంచి ఈ మెయిల్ వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు.
For More Latest National News and Telugu News..
Updated Date - May 23 , 2024 | 07:12 PM