BSF: సరిహద్దులో చైనా కవ్వింపులు.. వివాదాస్పద ప్రాంతంలో డ్రోన్ల ఎగరవేత
ABN, Publish Date - Apr 22 , 2024 | 10:16 AM
భారత్, చైనా సరిహద్దులో చైనా మళ్లీ కవ్వింపులకు పాల్పడింది. భారత భూభాగంలోకి రెండు డ్రోన్లను ఎగరవేసిన చైనా కుయుక్తుల్ని భారత దళాలు పసిగట్టాయి. సరిహద్దు భద్రతా దళం (BSF) పంజాబ్ పోలీసులతో కలిసి అమృత్‌సర్ సరిహద్దు ప్రాంతంలోని వేర్వేరు ప్రదేశాల్లో రెండు డ్రోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
అమృతసర్: భారత్, చైనా సరిహద్దులో చైనా మళ్లీ కవ్వింపులకు పాల్పడింది. భారత భూభాగంలోకి రెండు డ్రోన్లను ఎగరవేసిన చైనా కుయుక్తుల్ని భారత దళాలు పసిగట్టాయి. సరిహద్దు భద్రతా దళం (BSF) పంజాబ్ పోలీసులతో కలిసి అమృత్‌సర్ సరిహద్దు ప్రాంతంలోని వేర్వేరు ప్రదేశాల్లో రెండు డ్రోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
"ఏప్రిల్ 21న అమృత్‌సర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలోని రెండు వేర్వేరు ప్రదేశాలలో డ్రోన్‌లు తిరుగుతున్నట్లు BSF ఇంటెలిజెన్స్‌కి సమాచారం అందింది. పంజాబ్ పోలీసులతో బీఎస్ఎఫ్ దళాలు అనుమానిత ప్రాంతాలలో సర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో రెండు డ్రోన్లు స్వాధీనం చేసుకున్నాం. చైనా తయారు చేసిన డీజేఐ మావిక్ 3 క్లాసిక్ డ్రోన్లుగా గుర్తించాం. రెండూ ఆదివారం మధ్యాహ్నం లభ్యం అయ్యాయి. డ్రోన్‌ని ఆపరేట్ చేస్తున్న వ్యక్తులు వాటిని తిరిగి రప్పించుకోవడానికి ప్రయత్నించినా వారి ప్రయత్నాలు విఫలం చేశాం" అని బీఎస్ఎఫ్ సిబ్బంది ఒకరు తెలిపారు. అంతకుముందు ఏప్రిల్ 20 న ఫిరోజ్‌పూర్ సరిహద్దు ప్రాంతంలో మూడు హెరాయిన్ ప్యాకెట్లను కలిగి ఉన్న డ్రోన్‌ను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. డ్రోన్ ఎగురుతున్నట్లు ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం అందింది. స్పందించిన బీఎస్ఎఫ్ బలగాలు అనుమానిత ప్రాంతంలో విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో 2.710 కిలోల బరువున్న 3 హెరాయిన్ ప్యాకెట్లతో పాటు ఒక డ్రోన్‌ని విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు. నీలిరంగు బ్యాగ్‌లో హెరాయిన్ ఉందని అధికారులు తెలిపారు. ఇలా సరిహద్దులో పాకిస్థాన్, చైనా నుంచి నిత్యం కవ్వింపులు ఎదురవుతుండంతో సరిహద్దు భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి.
Supreme Court: అత్యాచార బాధితురాలి పిటిషన్.. గర్భవిచ్ఛిత్తిపై కీలక తీర్పు ఇవ్వనున్న సుప్రీం కోర్టు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 22 , 2024 | 10:16 AM