ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Goldy Brar: కెనడియన్ గ్యాంగ్‌స్టర్‌‌‌ గోల్డీ బ్రార్‌ను టెర్రరిస్టుగా ప్రకటించిన ఎంహెచ్ఏ

ABN, Publish Date - Jan 01 , 2024 | 06:12 PM

కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ సత్వీందర్ సింగ్ అలియాస్ సతిందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ పై కేంద్రం ఉక్కుపాదం మోపింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-1967 కింద గోల్డీ బ్రార్‌ను టెర్రరిస్టుగా ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో తెలియజేసింది.

న్యూఢిల్లీ: కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ సత్వీందర్ సింగ్ అలియాస్ సతిందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ (Goldy Brar)పై కేంద్రం ఉక్కుపాదం మోపింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-1967 కింద గోల్డీ బ్రార్‌ను టెర్రరిస్టుగా ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) ఒక ట్వీట్‌లో తెలియజేసింది.


ఎవరీ గోల్డీ బ్రార్..?

ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా దారుణ హత్యోదంతంతో గోల్డీ బ్రార్ పేరు ఒక్కసారి ప్రచారంలోకి వచ్చింది. దీనికి ముందే ఆయనపై పలు కేసులు ఉన్నాయి. రాపర్ హనీసింగ్‌ నుంచి రూ.50 లక్షల రూపాయలు అక్రమవసూళ్లు, పాకిస్థాన్‌ నుంచి ఇండియాకు ఆయుధాల స్మగ్లింపు, హత్య, హత్యాయత్నం సహా పలు కేసుల్లోనూ గోల్డీ బ్రార్‌ నిందితుడిగా ఉన్నాడు. విదేశాల్లో ఉంటూ ఇండియాలో క్రిమినల్ కార్యక్రమాలకు పాల్పడుతున్న అభియోగాలున్నాయి. ఈ ఘటనలకు తానే బాధ్యుడినంటూ సోషల్ మీడియా ద్వారా గోల్డీ బ్రార్ ఒప్పుకున్నాడు.


రడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ మధ్య చిరకాల స్నేహం ఉంది. లారెన్స్ బిష్ణోయ్ జైలులో ఉండగా, గోల్డీ విదేశాల్లో చక్కర్లు కొడుతున్నారు. గోల్డీబార్ 1994లో పంజాబ్‌లోని శ్రీముకర్తసర్ సాహిబ్‌లో జన్మించాడు. అతని తండ్రి పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నప్పటికీ నేరజీవితానికి గోల్డీ అలవాటు పడ్డాయి. తన కజిన్ గుర్లెజ్ బ్రార్ హత్య అనంతరం నేరజీవితం వైపు గోల్డీ మళ్ళాడు. ఆ తర్వాత పలు నేరాలకు పాల్పడ్డాయి. స్టూడెంట్ వీసా సంపాదించి కెనడాకు పారిపోయాడు. అక్కడి నుంచి పంజాబ్‌లో నేరాలు జరిపిస్తున్నాడు. వీటిపై పంజాబ్‌‌లో ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. అతనిపై రెడ్-కార్నర్ నోటీసు కూడా జారీ అయింది.

Updated Date - Jan 01 , 2024 | 06:12 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising