ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : అసోంలో ‘క్యాష్‌ ఫర్‌ మార్క్స్‌’ కుంభకోణం

ABN, Publish Date - Jul 01 , 2024 | 05:35 AM

అసోం రాష్ట్రంలో ‘క్యాష్‌ ఫర్‌ మార్క్స్‌’ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల మార్కులు పెంచడం కోసం యూనివర్సిటీ సిబ్బంది నగదు తీసుకున్నట్లు బయటపడింది.

  • గువాహటి యూనివర్సిటీలో డిజిటల్‌ ట్యాంపరింగ్‌

  • నగదుకు మార్కులు పెంచిన కంప్యూటర్‌ ఆపరేటర్లు

  • 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

న్యూఢిల్లీ, జూన్‌ 30: అసోం రాష్ట్రంలో ‘క్యాష్‌ ఫర్‌ మార్క్స్‌’ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల మార్కులు పెంచడం కోసం యూనివర్సిటీ సిబ్బంది నగదు తీసుకున్నట్లు బయటపడింది. దాంతో డిజిటల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు అనుమానిస్తున్న 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గువాహటి యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న గణేశ్‌ లాల్‌ చౌదరి కళాశాలకు చెందిన అజీజుల్‌ హాక్‌ అనే విద్యార్థికి వాస్తవంగా వచ్చిన మార్కులకు... మార్క్‌షీట్‌లో మార్కులకు మధ్య వ్యత్యాసం ఉండటంతో సీఐడీ విచారణ చేపట్టింది. పలు సెమిస్టర్లలో మార్కులను పెంచేందుకు గాను కంప్యూటర్‌ ఆపరేటర్లకు రూ. 10 వేలు చెల్లించినట్లు విద్యార్థి అంగీకరించాడు. ఈ కేసుకు సంబంధించి కీలక నిందితుడు కె కృష్టమూర్తి ఇప్పటికే అరెస్టు అయ్యాడు. మరికొంత మంది అరెస్టయ్యే అవకాశం కనిపిస్తోంది. డిజిటల్‌ ట్యాంపరింగ్‌ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు జరుపుతామని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. పది మంది విద్యార్ధుల మార్కులు పెంచినట్లు తేలిందని, ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సీఐడీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Jul 01 , 2024 | 05:35 AM

Advertising
Advertising