దేశంలో కుల గణన జరిగి తీరుతుంది: రాహుల్
ABN, Publish Date - Nov 07 , 2024 | 05:30 AM
దేశంలో కులగణన జరిగి తీరుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. అంతేకాకుండా తమ పార్టీ రిజర్వేషన్లకు ఉన్న 50 శాతం పరిమితినీ తొలగిస్తుందని స్పష్టం చేశారు. నాగ్‌పూర్‌లో నిర్వహించిన సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో
నాగ్‌పూర్, సాంగ్లి, వయనాడ్, నవంబరు 6 : దేశంలో కులగణన జరిగి తీరుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. అంతేకాకుండా తమ పార్టీ రిజర్వేషన్లకు ఉన్న 50 శాతం పరిమితినీ తొలగిస్తుందని స్పష్టం చేశారు. నాగ్‌పూర్‌లో నిర్వహించిన సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కులగణన వల్ల జనరల్ కేటగిరీ, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలు.. ఇలా అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. అలాగే వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ మలప్పురం జిల్లాలో మాట్లాడుతూ... బీజేపీ, ప్రధాని మోదీ రాజ్యాంగ విలువలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Updated Date - Nov 07 , 2024 | 05:30 AM