NEET-UG Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ తొలి అరెస్టు!
ABN, Publish Date - Jun 27 , 2024 | 05:50 PM
విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన నీట్ పేపర్ లీక్ కేసులో బాధితులకు న్యాయం దిశగా తొలి అడుగు పడింది. ఈ కేసుకు సంబంధించి పట్నాలో ఇద్దరు నిందితులను సీబీఐ అరెస్టు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన నీట్ పేపర్ లీక్ కేసులో (NEET-UG Paper Leak Case) బాధితులకు న్యాయం దిశగా తొలి అడుగు పడింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ తొలిసారిగా ఇద్దరు నిందితులను పట్నాలో అరెస్టు చేసింది. నిందితులను మనీశ్ కుమార్, ఆశుతోష్‌గా గుర్తించారు (CBI Makes first arrest).
Subramanian Swamy: మోదీకి ఆ చెడు అలవాటు.. బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
సీబీఐ వర్గాల ప్రకారం, మనీశ్ కుమార్ కొందరు విద్యార్థులను తన కారులో ఓ స్కూలుకు తరలించి అక్కడ వారికి పేపర్ అందజేసీ బట్టీ కొట్టించాడు. మరోవైపు ఆశుతోశ్ ఆ విద్యార్థులకు నివాస సదుపాయం కల్పించాడు. గురువారం సీబీఐ తొలుత నిందితులిద్దరనీ ప్రశ్నించి అనంతరం అరెస్టు చేసింది. కేంద్ర విద్యాశాఖ ప్రకటన అనంతరం కేసు బాధ్యతలు తీసుకున్న సీబీఐ ఇప్పటివరకూ ఆరు ఎఫ్ఐఆర్‌లు రిజిస్టర్ చేసింది.
అంతుకుమునుపే, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన పలువురిని సీబీఐ అదుపులోకి తీసుకుంది . వీరిలో ఓ నీట్ అభ్యర్థి కూడా ఉన్నాడు. పరీక్షకు ఒక రోజు ముందు పేపర్ తనకు అదిందని విద్యార్థి చెప్పినట్టు సమాచారం.
మే 5న జరిగిన నీట్-యూజీ ఎంట్రన్స్ పరీక్షకు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది హాజరైన విషయం తెలిసిందే. అయితే, షెడ్యూల్ కంటే 10 రోజుల ముందు జూన్ 4న ఫలితాలు వెలువడ్డాయి. అనంతరం పేపర్ లీక్ ఆరోపణలు వెలుగులోకి రావడం, సుమారు 1500 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చింది. నిరసనలు మిన్నంటాయి. సుప్రీం కోర్టులో కూడా కేసులు దాఖలవడంతో సర్వోన్నత న్యాయ స్థానం నీట్ పరీక్ష నిర్వహించిన ఎన్‌టీఏ ఏజెన్సీపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది.
మరోవైపు, ఈ ఉదంతానికి రాజకీయ ప్రాధాన్యం కూడా ఏర్పడింది. ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో రాష్ట్రపతి ముర్ము ప్రసంగంలో కూడా నీట్ ప్రస్తావన చేరింది. పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, పరీక్ష నిర్వాహణ విధానాన్ని మరింత మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. ముర్ము ప్రకటనపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. లోక్‌సభలో 232 ఎంపీలున్న ఇండియా కూటమి ఈ పార్లమెంటు సమావేశాల్లో టార్గెట్ చేసేందుకు నిర్ణయించింది.
For Latest News and National News click here
Updated Date - Jun 27 , 2024 | 06:08 PM