Delhi: హాట్.. హాట్‌గా బిహార్ రాజకీయాలు.. అమిత్ షా నివాసంలో కీలక సమావేశం
ABN, Publish Date - Jan 27 , 2024 | 01:23 PM
బిహార్ రాజకీయాలు(Bihar Politics) సీఎం నితీశ్ కుమార్(CM Nitish Kumar) చుట్టే తిరుగుతున్నాయి. ఆయన తన పదవికి రాజీనామా చేసి.. జేడీయూ, బీజేపీ కూటమి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే ఊహాగానాల నడుమ శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఢిల్లీ: బిహార్ రాజకీయాలు(Bihar Politics) సీఎం నితీశ్ కుమార్(CM Nitish Kumar) చుట్టే తిరుగుతున్నాయి. ఆయన తన పదవికి రాజీనామా చేసి.. జేడీయూ, బీజేపీ కూటమి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే ఊహాగానాల నడుమ శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(AmithShah)తో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ సహా పలువురు కీలక నేతలు సమావేశం అయ్యారు. ఇందులో జేడీయూతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, తమతో వచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు వంటి అంశాలపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నితీశ్ రాజీనామా!
సీఎం నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తారని, ఆ వెంటనే బీజేపీ(BJP)తో కూడిన కూటమితో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన శనివారం సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా నితీశ్ జేడీ(యూ)(JDU) ఎమ్మెల్యేలను పట్నాకు పిలిపించినట్లు సమాచారం. రాజీనామా అనంతరం బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన మార్గం సుగమం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో కూడా ఆయనే సీఎంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. దీంతో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ పార్టీల బంధానికి తెర పడనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Jan 27 , 2024 | 01:26 PM