ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mpox: ఎంపాక్స్ వ్యాధి వ్యాప్తిపై కేంద్రం అలర్ట్.. స్క్రీనింగ్, టెస్టింగ్‌ల సంఖ్య పెంచాలని ఆదేశం

ABN, Publish Date - Sep 09 , 2024 | 03:38 PM

ప్రపంచవ్యాప్తంగా కోరలు చాస్తున్న ఎంపాక్స్(Mpox) వ్యాధిపై కేంద్రం సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అనుమానిత వ్యక్తులందరికీ స్క్రీనింగ్, టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్‌ చేయాలని సూచించింది.

ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కోరలు చాస్తున్న ఎంపాక్స్(Mpox) వ్యాధిపై కేంద్రం సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అనుమానిత వ్యక్తులందరికీ స్క్రీనింగ్, టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్‌ చేయాలని సూచించింది. అనుమానిత, ధ్రువీకరించిన వ్యాధిగ్రస్థులకు చికిత్స చేయడానికి ఐసోలేషన్ కేంద్రాలను సిద్ధం చేయడానికి ఆసుపత్రులను గుర్తించాలని రాష్ట్రాలను కోరింది. అలాగే.. ప్రతిరోజూ ప్రజారోగ్య సంసిద్ధతపై సీనియర్ అధికారులతో సమీక్షించాలని కేంద్రం ఆదేశించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం.. జనవరి 2022, ఆగస్టు 2024 మధ్య 120 దేశాల్లో Mpox కేసులు వెలుగు చూశాయి. దాదాపు లక్షకుపైగా కేసులు నమోదుకాగా.. 220 మరణాలు సంభవించాయి.


రాష్ట్రాలకు కేంద్రం లేఖ..

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే వ్యాధిని హెల్త్ ఎమర్జెన్సీ‌గా ప్రకటించింది. అయితే తాజాగా జారీ చేసిన హెల్త్ అడ్వైజరీ ప్రకారం మన దేశంలో ఇప్పటివరకు ఒక్క మంకీపాక్స్ కేసు కూడా కన్ఫార్మ్ కాలేదు. కానీ అన్ని రాష్ట్రాలు ఈ వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ఆరోగ్యమంత్రిత్వ శాఖ సూచనలు పాటించాలని కోరింది. ఎయిర్ పోర్టుల్లో వ్యాధి అనుమానితులను గుర్తించేందుకు స్క్రీనింగ్ వేగవంతం చేసినట్లు కేంద్రం తెలిపింది.

వారిని పరీక్షించేందుకు ఐసీఎంఆర్ పరిధిలోని పరిశోధనాశాలల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చర్మ సంబంధిత వ్యాధులకు చికిత్స చేసే క్లినిక్స్‌పై దృష్టిపెట్టాలని సూచించింది. ప్రజల్లో భయాలు పోగొట్టి.. వ్యాధి వ్యాప్తిపై అవగాహన కల్పించాలని కోరింది. అనుమానాస్పదంగా ఉన్న అన్ని కేసులను పరీక్షించి, ధ్రువీకరించిన రోగుల కోసం ఆసుపత్రులలో ఐసోలేషన్ సౌకర్యాలను కల్పించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.


మంకీపాక్స్ లక్షణాలు ఏంటి?

మంకీపాక్స్ ఇన్‌ఫెక్షన్ సాధారణంగా 2-4 వారాల పాటు ఉంటుందని, సపోర్టివ్ మేనేజ్‌మెంట్‌తో రోగులు కోలుకుంటున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమావేశంలో వెల్లడైంది. అలైంగిక సంపర్కం, గాయపడిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం లేదా సోకిన వ్యక్తి దుస్తులు లేదా బెడ్‌షీట్‌లను ఉపయోగించడం ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది.

  • జ్వరం

  • చలిగా అనిపించడం

  • కండరాల నొప్పి

  • తలనొప్పి

  • అలసట


మంకీపాక్స్ చికిత్స ఎలా ?

Mpox చాలా సందర్భాలలో దానంతటదే తగ్గుతుంది. కానీ కొందరిలో ఇది తీవ్రంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేదా సూచించిన మందులు లేవు. రోగికి అతని లక్షణాల ఆధారంగా మాత్రమే చికిత్స చేస్తారు. వైద్యులు యాంటీవైరల్ మందులు ఇవ్వడం ద్వారా రోగి వ్యాధిని నియంత్రిస్తారు.

For Latest News and National News Click Here

Updated Date - Sep 09 , 2024 | 03:38 PM

Advertising
Advertising