Joshimath as Jyotirmath : జ్యోతిర్మఠ్‌గా మారిన జోషిమఠ్
ABN, Publish Date - Jun 12 , 2024 | 07:25 PM
ఉత్తరాఖండ్ లోని ఛమోలి జిల్లా జోషిమఠ్ తహసిల్ పేరు అధికారికంగా మారింది. జోషిమఠ్ ఇక నుంచి 'జ్యోతిర్మఠ్'గా పేరుమార్పు సంతరించుకుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఒకప్పుడు జ్యోతిర్మఠ్‌గానే ఈ పేరు వాడుకలో ఉండేది. క్రమంగా ఆ పేరు 'జోషిమఠ్'గా రూపాంతరం చెందింది.
జోషిమఠ్: ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని ఛమోలి జిల్లా జోషిమఠ్ (Joshimath) తహసిల్ పేరు అధికారికంగా మారింది. జోషిమఠ్ ఇక నుంచి 'జ్యోతిర్మఠ్' (Jyotirmath)గా పేరుమార్పు సంతరించుకుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఒకప్పుడు జ్యోతిర్మఠ్‌గానే ఈ పేరు వాడుకలో ఉండేది. క్రమంగా ఆ పేరు 'జోషిమఠ్'గా రూపాంతరం చెందింది. పురాతన పేర్లను పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా జ్యోషిమఠ్‌ను తిరిగి జ్యోతిర్మఠ్‌గా మార్చనున్నట్టు గత ఏడాది చమోలీ జిల్లా ఘాట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఆ ప్రతిపాదనకు తాజాగా కేంద్రం ఆమోదం తెలిపింది. ఉత్తరాఖండ్ ప్రాంతంలోని చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడం, పురాతన మూలాలను పరిరక్షించే దిశగా తాజా మార్పుచోటుచేసుకుంది.
Updated Date - Jun 12 , 2024 | 07:26 PM