ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chennai News: వీడు రక్షకుడు కాదు భక్షకుడు.. బురఖా తీసెయ్యాలని వేధిస్తూ..

ABN, Publish Date - Feb 24 , 2024 | 08:55 PM

పోలీసులు (Police) ఉన్నది సాధారణ ప్రజలకు రక్షణ కల్పించడం కోసం.. ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడం కోసం.. సమస్యల నుంచి బయటపడేసి వారికి న్యాయం అందించడం కోసం! కానీ.. కొందరు మాత్రం తమకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్యాయాలకు పాల్పడుతుంటారు. సహాయం కోసం తమ వద్దకు వచ్చిన బాధితులనే వేధింపులకు గురి చేస్తుంటారు. తాజాగా తమిళనాడులోనూ (Tamilnadu) ఓ అధికారి భక్షకుడిగా ప్రవర్తించాడు.

పోలీసులు (Police) ఉన్నది సాధారణ ప్రజలకు రక్షణ కల్పించడం కోసం.. ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడం కోసం.. సమస్యల నుంచి బయటపడేసి వారికి న్యాయం అందించడం కోసం! కానీ.. కొందరు మాత్రం తమకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్యాయాలకు పాల్పడుతుంటారు. సహాయం కోసం తమ వద్దకు వచ్చిన బాధితులనే వేధింపులకు గురి చేస్తుంటారు. తాజాగా తమిళనాడులోనూ (Tamilnadu) ఓ అధికారి భక్షకుడిగా ప్రవర్తించాడు. పోయిన తన స్కూటీని ఎలాగైనా వెతికి పెట్టమని ఓ ముస్లిం మహిళ ప్రాధేయపడితే.. బురఖా తొలగించాలని, చాలా అందంగా ఉంటారంటూ ఓ హెడ్ కానిస్టేబుల్ వేధింపులకు గురి చేశాడు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఈ ఘటన చెన్నైలో (Chennai) చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..


ఫిబ్రవరి 14న తన స్కూటర్ తప్పిపోయిందని ఫాతిమా అనే మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే.. ఫిర్యాదు చేసినా, కేసులో పురోగతి లేకపోవడంతో ఆమె కలత చెందింది. ఫిబ్రవరి 16వ తేదీన ఏదో ఒక పని నిమిత్తం పుదుపేట్‌కు వెళ్లగా.. అక్కడ ఆమెకు తప్పిపోయిన తన స్కూటీ కనిపించింది. దీంతో.. ఈ విషయం వెంటనే పోలీసులకు తెలిపింది. ఆమె అందించిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఆ స్కూటర్‌ను అధీనంలోకి తీసుకున్నారు. ఇంకేముంది.. స్టేషన్‌కు వెళ్లి తన స్కూటర్ తీసుకోవచ్చని ఫాతిమా ఆనందంగా వెళ్లింది. అయితే.. వెల్మురుగన్ అనే హెడ్ కానిస్టేబుల్ ఈ స్కూటర్‌ను కోర్టు నుంచి విడుదల చేయాల్సి ఉంటుందని ఆమెకు చెప్పాడు. కోర్టుకు వెళ్లడానికి సంకోచించిన ఆ మహిళ.. ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. తనకే ఎందుకు ఈ సమస్యలు అని రోధించింది. తాను ఈ స్కూటీపైనే ఆధారపడి జీవిస్తున్నానని, ఎలాగైనా తనకు స్కూటీ ఇప్పించాలని ఆమె ఆ కానిస్టేబుల్‌ని కోరింది.

కానీ.. వెల్మురుగన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. తాము దొంగతనం కేసు నమోదు చేశాము కాబట్టి.. కోర్టును తప్పకుండా ఆశ్రయించాల్సిందేనని చెప్పాడు. దీంతో ఆమె మరింత ఆవేదనకు గురైంది. అలాంటప్పుడు ఒక రక్షకుడిగా ఆమెను ఓదార్చాల్సిందిపోయి.. ఆ హెడ్ కానిస్టేబుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఏడుస్తున్నప్పుడు కూడా నువ్వు అందంగా ఉన్నావని అన్నాడు. బుర్ఖా విప్పేయండి, అది మీ ముఖాన్ని దాచిపెడుతోందని చెప్పాడు. అతని వ్యాఖ్యలతో మరింత నొచ్చుకున్న ఫాతిమా.. ఈ విషయం గురించి కుటుంబ సభ్యులకు తెలిపింది. అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు ఆ హెడ్ కానిస్టేబుల్ ప్రవర్తనపై పులియంతోప్ అసిస్టెంట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌ను విచారించి, వెంటనే సస్పెండ్ చేశారు.

Updated Date - Feb 24 , 2024 | 08:56 PM

Advertising
Advertising