వాననీటిలోనే చెన్నై శివారు ప్రాంతాలు
ABN, Publish Date - Oct 17 , 2024 | 06:38 AM
చెన్నైకి ముప్పు తప్పింది. వాయుగుండం నేపథ్యంలో చెన్నై సహా 9 జిల్లాలకు ‘రెడ్ అలెర్ట్’ ప్రకటించిన వాతావరణశాఖ బుధవారం ఉపసంహరించుకుంది.
చెన్నై, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): చెన్నైకి ముప్పు తప్పింది. వాయుగుండం నేపథ్యంలో చెన్నై సహా 9 జిల్లాలకు ‘రెడ్ అలెర్ట్’ ప్రకటించిన వాతావరణశాఖ బుధవారం ఉపసంహరించుకుంది. మంగళవారం అర్ధరాత్రి నుంచే చెన్నైలో చెదురుమదురు జల్లులు మినహా పెద్దగా వర్షమేమీ పడకపోవడంతో నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మంగళవారం కురిసిన కుండపోత వర్షం కారణంగా చెన్నై శివారు ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. కాగా, కన్యాకుమారి జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు సముద్రతీర ప్రాంతాల్లో 10 నుంచి 15 అడుగుల ఎత్తున అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. తీర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి సముద్రపు నీరు చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భారీ వర్షాల కారణంగా నీలగిరి జిల్లా కున్నూరు-ఊటీ మధ్య పలు చోట్ల రైలు పట్టాలపై మట్టి చరియలు, బండరాళ్లు విరిగిపడ్డాయి. దీంతో ఊటీ కొండరైలును తాత్కాలికంగా రద్దు చేసిన రైల్వే శాఖ మరమ్మతు పనులు చేపడుతోంది.
Updated Date - Oct 17 , 2024 | 06:38 AM