ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayodhya: మహర్షి వాల్మికీ ఎయిర్ పోర్టుకు భారీ భద్రత.. అందుకేనంటున్న ఆఫీసర్స్..

ABN, Publish Date - Jan 10 , 2024 | 10:34 AM

ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా.. అయోధ్య విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం

ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా.. అయోధ్య విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం భారీగా భద్రత పెంచింది. 150 మందికి పైగా సిబ్బందిని సీఐఎస్ఎఫ్ యాంటీ టెర్రరిస్ట్ కవర్‌ను మంజూరు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలో 68 వ విమానాశ్రయ టెర్మినల్‌గా మారింది. 2023 డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అయోధ్య విమానాశ్రయానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) భద్రత అందించనుంది. ప్రయాణికులు రాకపోకలు సాగించే ఎయిర్ గేట్‌వే సదుపాయానికి ముప్పు ఉన్న నేపథ్యంలో ఎయిర్ పోర్టుకు భద్రత కల్పిస్తున్నట్లు సీఐఎస్ఎఫ్ వెల్లడించింది.

ప్రారంభోత్సవం సందర్భంగా దేశ విదేశాల నుంచి పలువురు రానున్నందున అయోధ్యలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎయిర్ పోర్టు కు సెక్యూరిటీ కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. అవసరమైతే ఈ సంఖ్యను మరింత పెంచుతామన్నారు. మొదటి దశలో, విమానాశ్రయం 65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. గంటకు రెండు నుంచి మూడు విమానాలు రాకపోకలు సాగించేలా నిర్మించారు. బోయింగ్ 737, ఎయిర్‌బస్ 319, 320 ఈ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు.


రెండో దశలో రన్‌వే పొడవు 2,200 మీటర్ల నుంచి 3,700 మీటర్లకు పెరుగుతుంది. తద్వారా బోయింగ్ 787, బోయింగ్ 777 వంటి అంతర్జాతీయ విమానాలు అయోధ్యలో ల్యాండ్ అవుతాయి. 50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎయిర్ పోర్టు విస్తరించి ఉంటుంది.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 10 , 2024 | 10:34 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising