ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Siddaramaiah: అప్పుడు బీజేపీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడిందా.. సీఎం సిద్ధరామయ్య ఫైర్

ABN, Publish Date - Mar 02 , 2024 | 03:07 PM

బెంగళూరులోని (Bengaluru) రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్లపై (Rameshwaram Cafe Bomb Blast) బీజేపీ (BJP) చేసిన విమర్శలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) తిప్పికొట్టారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే బీజేపీ ఈ ఘటనపై రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ హయాంలో కూడా బాంబు పేలుళ్లు (Bomb Blasts) జరిగాయని, అప్పుడు వాళ్లు కూడా బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారా? అని సీఎం ప్రశ్నించారు.

బెంగళూరులోని (Bengaluru) రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్లపై (Rameshwaram Cafe Bomb Blast) బీజేపీ (BJP) చేసిన విమర్శలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) తిప్పికొట్టారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే బీజేపీ ఈ ఘటనపై రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ హయాంలో కూడా బాంబు పేలుళ్లు (Bomb Blasts) జరిగాయని, అప్పుడు వాళ్లు కూడా బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారా? అని సీఎం ప్రశ్నించారు. ఉగ్రవాద చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పిన ఆయన.. దీనిపై రాజకీయాలు చేయకూడదని సూచించారు. కాగా.. కాంగ్రెస్ (Congress) ఎక్కడ అధికారంలోకి వస్తుందో, అక్కడ ఉగ్రవాదులు & దేశ వ్యక్తిరేక శక్తులు ఇలా రెచ్చిపోతుంటారని ఈ బాంబు పేలుళ్ల ఘటనని ఉద్దేశించి బీజేపీ విమర్శించింది. ఇందుకు కౌంటర్‌గానే సిద్ధరామయ్య పైవిధంగా కౌంటర్ ఇచ్చారు.


ఇదే సమయంలో సిద్ధరామయ్య ఈ బాంబు పేలుళ్ల ఘటన గురించి మాట్లాడుతూ.. నిందితుడు ప్రెజర్ కుక్కర్‌ బాంబు (Pressure Cooker Bomb) వాడాడని వెల్లడించారు. ముఖానికి మాస్క్, తలకు క్యాప్‌ ధరించిన ఓ వ్యక్తి.. ఆ కేఫ్‌కి వచ్చాడని తెలిపారు. ఇడ్లీ ఆర్డర్ చేసిన తర్వాత ఒక దగ్గర కూర్చొని తిన్నాడని, అనంతరం బాంబుకు టైమర్ సెట్‌ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు. నిందితుడు ఎవరనే వివరాలు ఇంకా తెలియరాలేదని, అయితే అతని ఫోటోలు వచ్చాయని అన్నారు. సాధ్యమైనంత త్వరగా నిందితుడ్ని పట్టుకుంటామని హామీ ఇచ్చారు. దీని వెనుక ఉగ్రవాద సంస్థ హస్తం ఉందా? లేకపోతే ఇది ఒక వ్యక్తి పనేనా? అనేది ఇంకా వెలుగులోకి రాలేదని, దీనిపై సమగ్ర విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. మంగళూరు పేలుడుకు, బెంగళూరు పేలుడుకు ఏమాత్రం సంబంధం లేదని.. నివేదిక వచ్చిన తర్వాత తాము తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ బాంబు పేలుళ్లలో గాయపడిన వ్యక్తులు ప్రస్తుతం కోలుకుంటున్నారని సీఎం చెప్పుకొచ్చారు.

ఇదిలావుండగా.. ఈ సంఘటనపై కర్ణాటక పోలీసులు (Karnataka Police) దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు విచారణకు మొత్తం 8 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ పేలుళ్లలో మొత్తం 10 మంది గాయపడినట్లు తేలింది. రామేశ్వరం కేఫ్‌లో బాంబు పెట్టిన నిందితుడు కదలికలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. తాము అన్ని కోణాల్లోనూ ఈ కేసుని విచారిస్తున్నామని, బెంగళూరు వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం శివకుమార్ (Dy CM DK Shivakumar) ఇదివరకే ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా.. 2022 నవంబర్‌లో మంగళూరులోనూ ఇదే తరహాలో కుక్కర్‌ బాంబు పేలింది. ఇప్పుడు రామేశ్వరం కేఫ్‌లోనూ కుక్కర్ బాంబు పేలడంతో.. ఈ రెండు సంఘటనల మధ్య ఏమైనా లింక్ ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 02 , 2024 | 03:09 PM

Advertising
Advertising