ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Crime News: కోటాలో కోచింగ్ స్టూడెంట్ కిడ్నాప్.. తండ్రికి కుమార్తె ఫోటోలు.. అసలు ఏమైందంటే?

ABN, Publish Date - Mar 19 , 2024 | 12:10 PM

పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థిని కిడ్నాప్ (Kidnap) కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన యువతి కోటాలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఆదివారం కోచింగ్ సెంటర్‌(Coaching Center)కు వెళ్లి వచ్చిన తర్వాత విద్యార్థిని ఆమె తండ్రితో ఫోన్‌లో మాట్లాడింది. సోమవారం తండ్రి ఫోన్‌కు తన కుమార్తెను కట్టిపడేసిన ఫోటోలను కిడ్నాపర్లు పంపించారు. ఆమెను విడిచిపెట్టాలంటే రూ.30 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థిని కిడ్నాప్ (Kidnap) కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన యువతి కోటాలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఆదివారం కోచింగ్ సెంటర్‌(Coaching Center)కు వెళ్లి వచ్చిన తర్వాత విద్యార్థిని ఆమె తండ్రితో ఫోన్‌లో మాట్లాడింది. సోమవారం తండ్రి ఫోన్‌కు తన కుమార్తెను కట్టిపడేసిన ఫోటోలను కిడ్నాపర్లు పంపించారు. ఆమెను విడిచిపెట్టాలంటే రూ.30 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరించినట్లు తెలుస్తోంది. విద్యార్థిని తండ్రి ఈ విషయాన్ని బయటపెట్టారు. తన కుమార్తె కోటాలోని విజ్ఞాన్‌ నగర్‌లోని ఒక కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటోందని, కొచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు సమీపంలోని ఒక అద్దె గదిలో ఉంటుందని విద్యార్థిని తండ్రి తెలిపారు. ఆదివారం రాత్రి కోచింగ్ సెంటర్‌కు వెళ్లి వచ్చిన తర్వాత తనతో ఫోన్‌లో మాట్లాడిందన్నారు. సోమవారం తన ఫోన్‌కు కొన్ని ఫోటోలు వచ్చాయని, వాటిలో తన కుమార్తెను తాళ్లతో కట్టేసి ఉన్నట్లు చెప్పారు. ఒక అకౌంట్ నెంబర్ పంపించి రూ.30 లక్షలు అకౌంట్‌లో వేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.

విద్యార్థిని కిడ్నాప్‌పై కోట ఎస్పీ అమృత దుహాన్ స్పందిస్తూ.. యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు ధృవీకరించినప్పటికి.. విద్యార్థిని ఆచూకీ ఇంకా తెలియరాలేదని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 19 , 2024 | 12:10 PM

Advertising
Advertising