Aziz Qureshi: కాంగ్రెస్ దిగ్గజ నేత అజిజ్ ఖురేషి కన్నుమూత
ABN, Publish Date - Mar 01 , 2024 | 03:23 PM
కాంగ్రెస్ సీనియర్ నేత అజిజ్ ఖురేషి శుక్రవారంనాడు సుదీర్ఘ అస్వస్థతతో భోపాల్‌ని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్, మిజోరాం గవర్నర్‌గా కూడా గతంలో ఆయన పనిచేశారు.
భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత అజిజ్ ఖురేషి (Aziz Qureshi) శుక్రవారంనాడు సుదీర్ఘ అస్వస్థతతో భోపాల్‌ని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్, మిజోరాం గవర్నర్‌గా కూడా గతంలో ఆయన పనిచేశారు. ఖురేష్ కన్నుమూసిన వార్త తెలియగానే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఖురేషి మృతికి కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
అజిజ్ ఖురేషి 1941 ఏప్రిల్ 24న భోపాల్‌లో జన్మించారు. 1973లో మధ్యప్రదేశ్ క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. 1984లో మధ్యప్రదేశ్‌లోని సాత్నా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఉత్తరాఖండ్, మిజోరం, ఉత్తరప్రదేశ్ (అడిషనల్ చార్జ్) గవర్నర్‌గా కూడా ఆయన సేవలందించారు. 2020 జనవరి 24న అప్పటి కమల్‌నాథ్ ప్రభుత్వం ఖురేషిని మధ్యప్రదేశ్ ఉర్దూ అకాడమీకి అధ్యక్షునిగా నియమించింది.
Updated Date - Mar 01 , 2024 | 03:23 PM