Karnataka: ప్రజ్వల్ బాధితులకు పరిహారమిస్తాం
ABN, Publish Date - May 06 , 2024 | 04:02 AM
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వివాదంలో బాధిత మహిళలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వనుందని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జ్ రణదీ్‌పసింగ్ సుర్జేవాలా వెల్లడించారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు.
బెంగళూరు, మే 5(ఆంధ్రజ్యోతి): జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వివాదంలో బాధిత మహిళలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వనుందని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జ్ రణదీ్‌పసింగ్ సుర్జేవాలా వెల్లడించారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. బాధితులకు సీఎం సిద్దరామయ్య న్యాయం చేస్తారని అన్నారు. ఇదే విషయంపై అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా సీఎంకు లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు.
వందలాదిమందిపై లైంగిక వేధింపులు దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఎక్కడా చోటు చేసుకోలేదని అన్నారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడిన వ్యక్తికి మద్దతుగా ప్రధాని మోదీ ఎలా ప్రచారం చేశారని సూర్జేవాలా ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాలపై ప్రధాని మోదీ మౌనం వీడాలని ఏఐసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు అల్కాలంబ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
మూడు రోజుల సిట్ కస్టడీకి రేవణ్ణ
బెంగళూరు, మే 5 (ఆంధ్రజ్యోతి): కిడ్నాప్ వివాదం కేసులో అరెస్టయిన కర్ణాటకలోని హొళెనరసీపుర జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను సిట్ మూడు రోజుల కస్టడీకి తీసుకుంది. బెంగళూరులోని బౌరింగ్ ఆసుపత్రిలో ఆదివారం ఆయనకు వైద్య పరీక్షలు చేయించిన అధికారులు అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, మూడు రోజుల కస్టడీకి అనుమతి తీసుకున్నారు.
ఆయన్ను విచారించేందుకు ఈ నెల 8 వరకు మెజిస్ట్రేట్ అవకాశం కల్పించారు. అంతకు ముందు రేవణ్ణ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ, ఎలాంటి ఆధారం లేకుండానే తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. కిడ్నా్‌పతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
Updated Date - May 06 , 2024 | 04:03 AM