ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మాకు మరో 20 సీట్లు వచ్చి ఉంటే వాళ్లు ఈ పాటికి జైల్లో ఉండేవారు: ఖర్గే

ABN, Publish Date - Sep 12 , 2024 | 05:16 AM

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమకు మరో 20 సీట్లు దక్కి ఉంటే బీజేపీలో కొందరు

అనంత్‌నాగ్‌, సెప్టెంబరు 11: కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమకు మరో 20 సీట్లు దక్కి ఉంటే బీజేపీలో కొందరు నేతలు ఈ పాటికి జైళ్లలో ఉండేవారని అన్నారు. జమ్మూకశ్మీర్‌ అనంతనాగ్‌లో ఎన్నికల ప్రచారంలో ఖర్గే మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఖర్గే ఈ సందర్భంగా ఎవరి పేర్లు ప్రస్తావించనప్పటికీ ఈ వ్యాఖ్యలు బీజేపీ ముఖ్యనేతలకు ఉద్దేశించి చేసినవేనని అర్థమవుతోంది. మరోవైపు జమ్మూకశ్మీర్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ ఐదు గ్యారెంటీలను ప్రకటించింది. మహిళలకు రూ. 5లక్షల వరకు వడ్డీలేని రుణాలు, ప్రతి కుటుంబానికి రూ. 25లక్షల ఆరోగ్య బీమాతో పాటు పలు హామీలిచ్చింది. ప్రతి కుటుంబంలో ఓ మహిళకు నెలకు రూ. 3వేలు, కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 11 కేజీల ధాన్యం అలాగే మన్మోహన్‌ హయాంలో హామీ ఇచ్చినట్లు వలసవచ్చిన కశ్మీరి పండిట్‌లకు పునరావాసం కల్పిస్తామని ప్రకటించింది. అలాగే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది.

Updated Date - Sep 12 , 2024 | 05:16 AM

Advertising
Advertising