ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఇస్కాన్‌’పై బంగ్లాదేశ్‌లో నిషేధం?

ABN, Publish Date - Nov 28 , 2024 | 04:36 AM

అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం(ఇస్కాన్‌)పై నిషేధం విధించనున్నట్టు బంగ్లాదేశ్‌ సంచలన ప్రకటన చేసింది.

ఢాకా/న్యూఢిల్లీ, నవంబరు 27: అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం(ఇస్కాన్‌)పై నిషేధం విధించనున్నట్టు బంగ్లాదేశ్‌ సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం నిషేధం విధించే ప్రక్రియ కొనసాగుతోందని బంగ్లాదేశ్‌ అటార్నీ జనరల్‌(ఏజీ) అసదుజ్జమాన్‌ వెల్లడించారు. ఇస్కాన్‌ను మతతత్వ సంస్థగా అభివర్ణించారు. ఇస్కాన్‌కు నాయకుడు, ఆధ్యాత్మిక వేత్త చిన్మయ్‌ కృష్ణదా్‌సను దేశ ద్రోహం కేసు కింద బంగ్లాదేశ్‌ అరెస్టు చేసి, జైలులో పెట్టిన నేపథ్యంలో ఈ ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. మరోవైపు కృష్ణదాస్‌ అరెస్టును ఖండిస్తూ బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా సహా పలు ప్రాంతాల్లో ఇస్కాన్‌ సభ్యులు, హిందూ వర్గాలు కూడా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలపై బుధవారం ఢాకా హైకోర్టులో సుప్రీంకోర్టు న్యాయవాది మొనిరుజ్జమాన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇస్కాన్‌పై నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అదేవిధంగా రంగ్‌పూర్‌, చట్టోగ్రామ్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎమర్జెన్సీ విధించాలని కోరారు.

హైకోర్టు స్పందిస్తూ.. ఇస్కాన్‌ కార్యకలాపాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని బంగ్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇస్కాన్‌పై నిషేధం విధించే ప్రక్రియ కొనసాగుతోందని, తాజా పరిణామాలపై రాజకీయ పార్టీల నాయకులతో ప్రభుత్వం చర్చిస్తోందని ఏజీ హైకోర్టుకు తెలిపారు. మరోవైపు, బంగ్లాదేశ్‌లో చిన్మయ్‌పై నమోదైన కేసు, అరెస్టు వ్యవహారంలో ఐక్యరాజ్యసమితి(ఐరాస) జోక్యం చేసుకోవాలని ఇస్కాన్‌ కోల్‌కతా కార్యాలయం కోరింది. మరోవైపు, చిన్మయ్‌ అరెస్టును తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ‘‘బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే పాకిస్థాన్‌ను తలపిస్తోంది’’ అని కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌ విమర్శించారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి కచ్చితంగా జోక్యం చేసుకోవాల్సి ఉందన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 04:36 AM