ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kanwar Yatra 2024: యూపీ ప్రభుత్వంపై ప్రియాంక మండిపాటు

ABN, Publish Date - Jul 19 , 2024 | 07:57 PM

కన్వర్ యాత్ర సాగే మార్గంలో హోటల్ యజమానులు, సిబ్బంది పేర్లు తప్పక ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు.

Congress party leader Priyanka Gandhi

న్యూఢిల్లీ, జులై 19: కన్వర్ యాత్ర సాగే మార్గంలో హోటల్ యజమానులు, సిబ్బంది పేర్లు తప్పక ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఇది మన రాజ్యాంగంపైన, మన ప్రజాస్వామ్యంపైన, మన సంస్కృతిపైన దాడిగా ఆమె అభివర్ణించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు. ఈ ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని యోగి ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.

Air India Passengers: రష్యాలో చిక్కుకున్న ప్రయాణికులు.. వారి కోసం బయలుదేరి విమానం


అలాగే ఈ ఆదేశాలు జారీ చేసిన ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. కులం, మతం, భాష లేదా మరే ఇతర ప్రాతిపదికన వివక్ష చూపబడదంటూ ప్రతీ పౌరుడికి మన రాజ్యాంగం హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. అయితే యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు మాత్రం సమాజాన్ని కుల, మతాల ఆధారంగా విభజించేలా ఉన్నాయని ఆమె మండిపడ్డారు. అంతేకాదు.. రాజ్యాంగానికి వ్యతరేకంగా ఈ ఆదేశాలున్నాయన్నారు.

Also Read: Visakhapatnam: పిల్లల అల్లరి మాన్పించే క్రమంలో మృత్యు ఒడిలోకి ‘తండ్రి’


కన్వర్ యాత్ర ఎప్పడు ప్రారంభమై.. ఎప్పడితో ముగియనుంది.

శివరాత్రి సందర్బంగా శివభక్తులు లేదా కవరియాస్ హరియాణలోని కన్వర్ నుంచి హరిద్వార్ వరకు ఈ యాత్ర చేయనున్నారు. ఆ క్రమంలో ఈ యాత్ర జులై 22న కన్వర్‌లో ప్రారంభమవుతుంది. ఆగస్ట్ 2వ తేదీన హరిద్వార్‌లో ఈ యాత్ర ముగుస్తుంది. పలు రాష్ట్రాల గుండా ఈ యాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో ఈ యాత్ర సాగే మార్గాల్లో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోనుంది.

Also Read: New Delhi: విదేశీ పర్యాటకులను వెంబడించిన బాలికలు.. ఎందుకోసమంటే..


అలాగే ఆ మార్గంలో భక్తులు తినే తినుబండారాలకు సంబంధించిన యోగి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అందులోభాగంగా హలాల్ ధృవీకరణతో ఉత్పత్తులను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోనేందుకు యోగి ప్రభుత్వం సన్నధ్దమైంది.

Also Read: Ayodhya: బీజేపీపై మహువా మొయిత్రా వ్యంగ్యాస్త్రాలు

Also Read: Microsoft: మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిన సేవలు..!


ఈ నేపథ్యంలో యోగి ప్రభుత్వం కన్వర్ యాత్ర సాగే ప్రాంతంలో హోటళ్లు, తినుబండార శాలలు, బేకరీలు తదితర దుకాణాల వద్ద.. ఆ యా యజమానుల పేర్లు ఖచ్చితంగా ప్రదర్శించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఇక యోగా ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలపై ప్రతిపక్షాల నుంచే కాదు.. స్వపక్షంలోని నేతల నుంచి తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఇంకా చెప్పాలంటే.. యూపీలో ఈ సారి జరగనున్న కన్వర్ యాత్ర పెద్ద దుమారం రగిల్చేలా ఉందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 19 , 2024 | 07:58 PM

Advertising
Advertising
<