ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Manipur firing: మణిపూర్‌లో మళ్లీ కాల్పులు..సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతి

ABN, Publish Date - Jul 14 , 2024 | 05:19 PM

మణిపూర్‌ లో మళ్లీ సాయుధ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాను ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. జిరిబామ్ జిల్లా మాంగ్‌బుగ్, సెయిజాంగ్ గ్రామాల్లో సాయుధ దుండగులకు, రాష్ట్ర-కేంద్ర పోలీసు బలగాలకు మధ్య ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.

ఇంఫాల్: మణిపూర్‌ (Manipur)లో మళ్లీ సాయుధ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాను ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. జిరిబామ్ జిల్లా మాంగ్‌బుగ్, సెయిజాంగ్ గ్రామాల్లో సాయుధ దుండగులకు, రాష్ట్ర-కేంద్ర పోలీసు బలగాలకు మధ్య ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. బీహార్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ డ్రైవర్ అజయ్ కుమార్ ఝా (43) నుదిటికి బుల్లెట్ గాయం కావడంతో జిరిబామ్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన కన్నుమూశారు. మరో జవాను గాలికి గాయం కాగా, ఇద్దరు మణిపూర్ కమండోలకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. వీరు ప్రస్తుతం జిరిబామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయుధ దుండగులకు, బలగాలకు మధ్య జరిగిన కాల్పులు మధ్యాహ్నం 11.30 గంటలకు ముగిసాయి.

Armstrong: బీఎస్పీ అధ్యక్షుడి హత్య కేసులో నిందితుడు ఎన్‌కౌంటర్‌


దాడిని ఖండించిన సీఎం

సాయుధ దండగులు భద్రతా బలగాలపై కాల్పులు జరిగిన ఘటనను ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ఖండించారు. మృతిచెందిన జవాను కుటుంబానికి సంతాపం తేలియజేసారు. అమరజవాన్ల త్యాగాలు వృథాకావన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. కాగా, బలగాలపై కాల్పులకు తెగబడిన సాయుధ దుండగులను కుకీ మిలిటెంట్లుగా అనుమానిస్తు్న్నారు.

For Latest News and National News

Updated Date - Jul 14 , 2024 | 05:19 PM

Advertising
Advertising
<