ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పార్లమెంటులో ప్రతిష్టంభనకు తెర!

ABN, Publish Date - Dec 03 , 2024 | 04:08 AM

పార్లమెంటులో పలు అంశాలపై చర్చ జరపాలన్న అంశంపై కేంద్రం, విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెర పడింది.

న్యూఢిల్లీ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : పార్లమెంటులో పలు అంశాలపై చర్చ జరపాలన్న అంశంపై కేంద్రం, విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెర పడింది. ఉభయ సభల్లో రాజ్యాంగంపై చర్చకు కేంద్రం అంగీకారం తెలపడంతో ఎట్టకేలకు మంగళవారం నుంచి సభ సజావుగా సాగేందుకు ఇరు పక్షాల మధ్య సయోధ్య ఏర్పడింది. నవంబరు 25న శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి అదానీ, సంభాల్‌ హింసాకాండ, మణిపూర్‌ అశాంతి వంటి విషయాలపై విపక్షాల తీవ్ర ఆందోళనల ఫలితంగా లోక్‌సభ, రాజ్యసభలు నిరంతరం వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే.. పార్లమెంటులో ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు అధికార బీజేపీ, ప్రతిపక్ష పార్టీలు సోమవారం ఒక ఒప్పందానికి వచ్చినట్లు పార్లమెంటు వర్గాలు తెలిపాయి. ఈమేరకు పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో స్పీకర్‌ ఓం బిర్లా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు మీడియాతో మాట్లాడుతూ...

రాజ్యాంగంపై డిసెంబరు 13, 14 తేదీల్లో లోక్‌సభలో, డిసెంబరు16, 17 తేదీల్లో ఎగువసభలో చర్చ జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు ఉభయ సభల్లో చర్చలు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయన్నారు. కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఐదోరోజైన సోమవారం సైతం అంతంతమాత్రంగానే జరిగాయి. అదానీ ముడుపుల వ్యవహారంపై ప్రధాని మౌనం వీడాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఈ అంశంపై జేపీసీ వేయాలని ఉభయ సభల్లో విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. దీంతో, రెండు సభలను వాయిదా వేశారు.

Updated Date - Dec 03 , 2024 | 04:08 AM