ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi High Court: అంజలి బిర్లాకు వ్యతిరేకంగా పోస్ట్‌లు.. కీలక ఆదేశాలు

ABN, Publish Date - Jul 23 , 2024 | 06:04 PM

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా ప్రతిష్టకు భంగం కలిగేంచేలా సోషల్ మీడియాలో వైరలవుతున్న పోస్ట్‌లను తొలగించాలని ఎక్స్ కార్పొరేషన్‌తోపాటు గూగుల్ ఇంటర్నేషనల్ కంపెనీని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది.

LokSabha Speaker Om Birla, Anjali Birla

న్యూఢిల్లీ, జులై 21: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా ప్రతిష్టకు భంగం కలిగేంచేలా సోషల్ మీడియాలో వైరలవుతున్న పోస్ట్‌లను తొలగించాలని ఎక్స్ కార్పొరేషన్‌తోపాటు గూగుల్ ఇంటర్నేషనల్ కంపెనీని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. అందుకు సంబంధించిన పోస్ట్‌లను 24 గంటల్లోగా సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆ యా కంపెనీలకు జారీ చేసిన ఆదేశాల్లో ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ వేళ ఆ యా పోస్టులను తొలగించకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

Also Read: Budget 2024: బిహార్‌కు ప్రత్యేక హోదా లేదు కానీ..


అయితే ఈ అంశంపై ఎక్స్ కార్పొరేషన్‌, గూగుల్ ఇంటర్నేషనల్ కంపెనీలతోపాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైతం నాలుగు వారాల్లో స్పందించాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత కావడం కోసం తండ్రి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పరపతిని ఆయన కుమార్తె అంజలి బిర్లా ఉపయోంచుకొందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరలవుతున్నాయి.

Also Read: Union Budget 2024: బడ్జెట్‌పై స్పందించిన మంత్రి నారా లోకేశ్


అంజలి ఇలా యూపీఎస్సీ పరీక్షలకు హాజరై.. అలా సర్వీస్‌లో జాయిన్ అయిందంటూ విమర్శలు సోషల్ మీడియలో వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును అంజలీ బిర్లా ఆశ్రయించింది. దీంతో మంగళవారం ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Also Read:Budget 2024: బడ్జెట్‌పై స్పందించిన సీఎం చంద్రబాబు

Union Budget 2024: వీటి ధరలు తగ్గుతాయి.. వీటి ధరలు పెరుగుతాయి.


అయితే 2019లో అంజలి బిర్లా యూపీఎస్సీ పరీక్షకు హాజరైందని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ క్రమంలో ఆమె ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ (ఐఆర్‌పీఎస్)కు ఎంపికైందని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు. మరోవైపు 2019 ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం వరుసగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం లోక్ సభ స్పీకర్‌గా ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా ఎంపికైన విషయం విధితమే.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 23 , 2024 | 06:04 PM

Advertising
Advertising
<