Delhi : నిరంకుశ ముప్పులో మన ప్రజాస్వామ్యం
ABN, Publish Date - Jul 12 , 2024 | 04:18 AM
ప్రజాస్వామ్యం తీవ్ర నిరంకుశ ఒత్తిడికి గురి అవుతున్న దేశాల జాబితాలో భారత్ పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నదని అమెరికాకు చెందిన ఓ సంస్థ హెచ్చరించింది.
తీవ్ర ఒత్తిడిలో మీడియా పౌర హక్కులు, ఎన్నికలు
భారత్‌లో పరిస్థితి అధ్వానం
3.5 రేటింగ్ ఇచ్చిన అమెరికా సంస్థ
న్యూఢిల్లీ, జూలై 11: ప్రజాస్వామ్యం తీవ్ర నిరంకుశ ఒత్తిడికి గురి అవుతున్న దేశాల జాబితాలో భారత్ పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నదని అమెరికాకు చెందిన ఓ సంస్థ హెచ్చరించింది. దాదాపు వెయ్యిమంది స్కాలర్స్‌ను నమూనాగా తీసుకుని 1 నుంచి 5 వరకు సూచీల (అథారిటేరియన్ థ్రెట్ ఇండెక్స్) ఆధారంగా యాంటీ అథారిటేరియనిజం గ్రూపు’ అనే సంస్థ అమెరికా సహా ఆరు దేశాలకు రేటింగ్ ఇచ్చింది.
ప్రతి వారాంతంలో వీరిపై జరిపిన అధ్యయయాన్ని ఆధారంగా చేసుకుని తాజాగా సూచీలను నిర్ణయించింది. ఆరోగ్య ప్రజాస్వామ్యం కలిగిన దేశానికి రేటింగ్ వన్ ఇచ్చింది. ఈ సూచీల్లో భారత్‌కు 3.5 రేటింగ్ ఇచ్చారు. అత్యధికంగా నిరంకుశత ముప్పును భారత్ కలిగి ఉన్నదని పేర్కొంది. హక్కులు, ప్రజాస్వామ్యం విషయంలో అధ్వాన్న స్థితిలో ఉన్నదని వ్యాఖ్యానించింది.
ఇక మిగతా దేశాల్లో అమెరికా 2.1, పోలాండ్ 2.3., జర్మనీ 1.5, కెనడా 1.5, ఇంగ్లాండ్ 1.8 రేటింగ్‌లో ఉన్నాయి. 2017 నుంచి తీస్తున్న సూచీల ఆధారంగా తాజాగా రేటింగ్‌ను ఇచ్చినట్టు ఈ సంస్థ ను ఉటంకిస్తూ ఫైనాన్సియల్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. ప్రధానంగా అమెరికాలోని ప్రజాస్వా మ్య వ్యవస్థలపై దృష్టి సారించిన ఈ గ్రూపు, దానితోపాటు మరో ఐదు దేశాలపైనా అధ్యయనం చేసింది. ఇందుకు ఆరు ప్రమాణాలను పెట్టుకుంది. అవి 1) మీడియా పట్ల వైఖరి 2) కార్యనిర్వాహక అవరోధాలు 3) ఎన్నికలు 4) పౌర హక్కులు 5) పౌర హింస 6) వ్యవహారిక భాష.
Updated Date - Jul 12 , 2024 | 04:18 AM